West Bengal మంత్రి పరేష్ చంద్రపై సీబీఐ కేసు

ABN , First Publish Date - 2022-05-20T15:23:27+05:30 IST

పశ్చిమ బెంగాల్ మంత్రి పరేష్ చంద్ర అధికారిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది....

West Bengal మంత్రి పరేష్ చంద్రపై సీబీఐ కేసు

కుమార్తెకు స్కూల్ టీచరుగా రిక్రూట్‌మెంట్

కోల్‌కతా(పశ్చిమబెంగాల్):పశ్చిమ బెంగాల్ మంత్రి పరేష్ చంద్ర అధికారిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. మంత్రి పరేష్ చంద్ర అధికారిని 2018వసంవత్సరంలో స్కూల్ టీచర్‌గా తన కుమార్తెను అక్రమంగా రిక్రూట్‌మెంట్ చేసినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి మంత్రి పరేష్ చంద్రను గురువారం ప్రశ్నించింది.సీబీఐ అధికారులు కార్యాలయంలో మంత్రిని మూడు గంటల పాటు ప్రశ్నించారు.అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌లతో పాటు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్‌ 420, 120బి కింద మంత్రి, అతని కుమార్తెలపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారి తెలిపారు.


రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) సిఫారసుల మేరకు పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని అక్రమంగా నియమించారనే ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి కేంద్ర ఏజెన్సీ పలు కేసులను విచారిస్తోంది.బుధవారం రాత్రి హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ గంగోపాధ్యాయ ఆదేశాల మేరకు కోల్‌కతాలోని ఎస్ఎస్‌సీ కార్యాలయంలో గురువారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ని మోహరించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్‌ఎస్‌సి కార్యాలయంలోకి అధికారులెవరూ ప్రవేశించకూడదని కోర్టు ఆదేశించింది. 

Updated Date - 2022-05-20T15:23:27+05:30 IST