జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌ విచారణకు సీబీఐ కోర్టు ఓకే

ABN , First Publish Date - 2021-04-16T10:00:29+05:30 IST

అక్రమాస్తుల కేసుల్లో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైసీపీ

జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌ విచారణకు సీబీఐ కోర్టు ఓకే

22న విచారణకు వచ్చే అవకాశం 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసుల్లో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ కృష్ణంరాజు గతవారం కోర్టును ఆశ్రయించారు. అయితే సాంకేతిక కారణలతో ఈ వ్యాజ్యాన్ని సీబీఐ కోర్టు తిరస్కరించింది. కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలకు వివరణ ఇస్తూ గురువారం ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు. కృష్ణంరాజు ఇచ్చిన వివరణపైసీబీఐ కోర్టు న్యాయమూర్తి బీ.ఆర్‌. మధుసూదన్‌రావు సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ వ్యాజ్యం ఈనెల 22న సీబీఐ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

Updated Date - 2021-04-16T10:00:29+05:30 IST