జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఛార్జ్‌షీట్లపై సీబీఐ కోర్టు విచారణ

ABN , First Publish Date - 2021-01-21T23:06:12+05:30 IST

సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఛార్జ్‌షీట్లపై సీబీఐ కోర్టు విచారించింది. ఈడీ ఛార్జ్‌షీట్లపై ముందుగా విచారణ జరపాలని ఈ నెల 11న కోర్టు నిర్ణయం తీసుకుంది.

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఛార్జ్‌షీట్లపై సీబీఐ కోర్టు విచారణ

హైదరాబాద్: సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఛార్జ్‌షీట్లపై సీబీఐ కోర్టు విచారించింది. ఈడీ ఛార్జ్‌షీట్లపై ముందుగా విచారణ జరపాలని ఈ నెల 11న కోర్టు నిర్ణయం తీసుకుంది. సీబీఐ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టుకు వెళ్తామని జగన్ తరపు న్యాయవాది తెలిపారు. హైకోర్టు అప్పీల్ వెళ్లేందుకు జగన్ తరపు లాయర్‌ సమయం కోరారు. అరబిందో, హెటిరో కేసులో వ్యక్తిగత హాజరు మినహాయించాలని జగన్ కోర్టును అభ్యర్థించారు. జగన్ అభ్యర్థనపై కౌంటరు దాఖలుకు ఈడీ గడువు కోరింది. కేసు నుంచి బీపీ ఆచార్యను ఇటీవల హైకోర్టు తొలగించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈడీ అప్పీల్‌ వేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-01-21T23:06:12+05:30 IST