హైదరాబాద్: నగరంలోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్‌డీ)లో జరిగిన అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. పుస్తకాలు, ఇతర మెటీరియల్ ముద్రణలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. ఎన్ఐఆర్‌డీ అధికారులు రాజశేఖర్, పాపమ్మ, శ్రీధర్‌గౌడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. బాలాజీ స్కాన్ ప్రై.లి. డైరెక్టర్ ప్రసాద్, వైష్ణవి లేజర్ గ్రాఫిక్స్ యజమాని వి.సుధాకర్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేసింది. 2015-2019 మధ్య ముద్రణలో అక్రమాల ద్వారా రూ.1.56 కోట్ల నష్టం జరిగినట్లు సీబీఐ అభియోగం మోపింది.