Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్‌పై సీబీఐ కేసు

అమరావతి: రాష్ట్రంలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్, నంది గ్రెయిన్ డెరివేటివ్స్‌పై సీబీఐ కేసు నమోదయింది. కంపెనీ డైరెక్టర్లు సురేష్‌కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డిపై కేసు నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని  సీబీఐకి బీఓబీ ఫిర్యాదు చేసింది. కంపెనీ ప్రతినిధులు ఎస్పీవై రెడ్డి సహా పలువురు మోసం చేశారని సీబీఐకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తమకు రూ.61.86 కోట్ల నష్టం కలిగిందని సీబీఐకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేసింది. 


Advertisement
Advertisement