నాగపూర్: అవినీతికి పాల్పడిన ముగ్గురు ఇండియన్ ఆయిల్ కంపెనీ(ఐఓసీఎల్) అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.ఐఓసీఎల్ కు చెందిన జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సేల్స్ ఆఫీసర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. పెట్రోల్ బంకు రిటైల్ అవుట్లెట్ యాజమాన్యం బదిలీ అగ్రిమెంటు కోసం ఐఓసీఎల్ కంపెనీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, జనరల్ మేనేజర్లు (రిటైల్ సేల్స్) ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేశారు. రిటైలర్ ఫిర్యాదు మేర సీబీఐ అధికారులు రంగంలోకి దిగి ముగ్గురు ఆయిల్ కంపెనీ ఉన్నతాధికారులపై కేసు పెట్టారు. సీబీఐ కేసు నమోదు చేసిన అధికారుల్లో నాగపూర్ నగరానికి చెందిన జీఎం ఎన్పీ రోడ్గీ, చీఫ్ మేనేజర్ మనీష్ నాంద్లేలు ఉన్నారు.
పెట్రోల్ బంకు యజమాని చీఫ్ మేనేజరుకు లంచం ఇచ్చాడని సీబీఐ దాడుల్లో తేలింది. గోండియా ఐఓసీఎల్ సేల్స్ ఆఫీసర్ పెట్రోల్ బంకుపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా ఉండటానికి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో సేల్స్ ఆఫీసర్ సునీల్ గోలార్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.అవినీతి ఐఓసీఎల్ అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసింది.
ఇవి కూడా చదవండి