కంపెనీ నిధుల దుర్వినియోగం కేసులో సీబీఐ చర్యలు
కోల్కతా (పశ్చిమబెంగాల్): ఇషాపూర్ రైఫిల్ ఫ్యాక్టరీలో నిధుల దుర్వినియోగంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు సాగిస్తోంది.పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఇషాపూర్ రైఫిల్ ఫ్యాక్టరీ మాజీ అధికారి మధుసూదన్ ముఖోపాధ్యాయ్ 2012-2016 మధ్య కాలంలో రూ.1.7 కోట్లను స్వాహా చేశారని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఇషాపూర్ రైఫిల్ ఫ్యాక్టరీలో ఐదేళ్ల క్రితం జరిగిన కోట్లాదిరూపాయల దుర్వినియోగంపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దానికి కారణమైన మాజీ అధికారి మధుసూదన్ ముఖోపాధ్యాయ్ ను అరెస్టు చేశారు. రైఫిల్ ఫ్యాక్టరీ కుంభకోణంలో నిందితుడైన మధుసూదన్ ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి తరలించారు.