కొవిడ్‌ వైద్యసేవలు అందించడంతో విఫలం

ABN , First Publish Date - 2021-06-18T02:52:24+05:30 IST

వైద్యనిపుణులు ఫిబ్రవరి నుంచే కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుందని హెచ్చరించినా కూడా ప్రభుత్వం

కొవిడ్‌ వైద్యసేవలు అందించడంతో విఫలం
ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల, నాయకులు

నాయుడుపేట టౌన్‌, జూన్‌ 17 : వైద్యనిపుణులు ఫిబ్రవరి నుంచే కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుందని హెచ్చరించినా కూడా ప్రభుత్వం  కొవిడ్‌ వైద్యసేవలు అందించడంలో విఫలమైందని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్డీవో సరోజినికి గురువారం నెలవల నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన కుటుంబసభ్యులకు రూ. 10 లక్షలు ఆర్ధికసాయం చేయడంతోపాటు అలాగే బ్లాక్‌ ఫంగస్‌ మృతుల కుటుంబాలకు రూ. 25లక్షలు ఆర్ధిక సాయం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు గూడూరు రఘునాథరెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, పెళ్లకూరు, ఓజిలి మండల అధ్యక్షుడు వేలూరు మురళీకృష్ణారెడ్డి, గుజ్జలపూడి విజయకుమార్‌నాయుడు, మాజీ జడ్పీటీసీ శ్రీరామ్‌ ప్రసాద్‌,  రవి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T02:52:24+05:30 IST