చెమట వాసనతో పాజిటివ్‌లను పట్టేస్తాయ్‌!

ABN , First Publish Date - 2020-08-02T06:27:05+05:30 IST

మనిషి స్వేదం వాసన ద్వారా కూడా కరోనా వైరస్‌ ఉందో లేదో తెలుసుకోగలిగితే? లక్షణాలు బయటపడని రోగుల ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించగలిగితే? ఇందుకు చిలీ

చెమట వాసనతో పాజిటివ్‌లను పట్టేస్తాయ్‌!

  • జాగిలాలకు ప్రత్యేక శిక్షణనిస్తున్న చిలీ పోలీసులు

న్యూఢిల్లీ, ఆగస్టు 1: మనిషి స్వేదం వాసన ద్వారా కూడా కరోనా వైరస్‌ ఉందో లేదో తెలుసుకోగలిగితే? లక్షణాలు బయటపడని రోగుల ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించగలిగితే? ఇందుకు చిలీ పోలీసులు, నాలుగు ప్రత్యేక జాగిలాలను శిక్షణ కోసం ఎంపిక చేశారు. ఇవి.. మనుషుల చెమట వాసన ద్వారా ప్రాథమిక దశలోనే వైర్‌సను గుర్తించగలుగుతాయి. బ్రిటన్‌లో పరిశోధనలు మంచి ఫలితాలను ఇవ్వడంతో చిలీ పోలీసులు కూడా దేశ రాజధాని సాంటియాగోలో జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జనసమ్మర్థ ప్రదేశాలైన స్కూళ్లు, బస్‌ స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఈ జాగిలాలు, వాసన ద్వారా వైరస్‌ ఉన్న రోగులను గుర్తిస్తాయి. ఫలితంగా ప్రాథమిక దశలోనే వైద్య సేవ లందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని లెఫ్టెనెంట్‌ కల్నల్‌, ప్రత్యేక శిక్షణ తరగతుల డైరెక్టర్‌ క్రిస్టియన్‌ ఆక్విడో యాన్జీ పేర్కొన్నారు. చెమట ద్వారా కరోనా రోగులను జాగిలాలు గుర్తించే తొలి ట్రయల్‌ను లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌లో చేశారు. 

Updated Date - 2020-08-02T06:27:05+05:30 IST