మృతిచెందిన పశువులు
గుడిపాల, మే 27: మండలంలోని నంగమంగళం పంచాయతీలో గురువారం రాత్రి వింత వ్యాధితో మూడు పశువులు మృతిచెందాయి. గ్రామంలోని రాజేంద్ర మందడికి చెందిన మూడు ఆవులు మృతిచెందాయి. పశువుల మృతికి కారణాలు తెలియరాలేదు. దీంతో గ్రామంలోని మిగతా పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.