Abn logo
Jul 30 2021 @ 01:10AM

పశువులు రోడ్లపైకి వస్తే యజమానులకు జరిమానా : డీఎస్పీ

మచిలీపట్నం టౌన్‌ : రోడ్లపై సంచరించే పశువులను గుర్తించి యజమానులకు జరిమానా విధిస్తామని, కట్టడి చేయక పోతే దూర ప్రాంతాలకు తరలిస్తామని డీఎస్పీ మసుంబాషా పేర్కొన్నారు. ఆర్‌ అండ్‌ బి అతిఽథి గృహంలో గురువారం కార్పొరేటర్లు, పశువుల యజమానులతో డీఎస్పీ మసుంబాషా అవగాహనా సదస్సు నిర్వహించారు.  కమిషనర్‌ శివరామకృష్ణ మాట్లాడుతూ, రోడ్లపై తిరిగే పశువుల యజమానులకు నోటీసులు ఇస్తామన్నారు. ట్రాఫిక్‌ డీఎస్పీ భరత్‌మాతాజీ మాట్లాడుతూ, నగరం లో పశువుల సంచారంపై వల్ల కలిగే ఇబ్బందులపై అనౌన్స్‌మెంట్లు ఇప్పిస్తామన్నారు. సీఐ అంకబాబు, ఆర్‌పేట సీఐ బీమరాజు, కార్పొరేటర్లు లంకా సూరిబాబు, నాయకులు నాలి మాధవ, సాయి, చిన్నా, సన్‌షైన్‌ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు బేతపూడి మనోహర్‌, పశుసంవర్ధక శాఖ ఏడీ, అసిస్టెంట్‌ టౌన్‌ ప్లానర్‌ నాగశాస్ర్తులు తదితరులు పాల్గొన్నారు.