Abn logo
Jun 24 2021 @ 01:39AM

మత్తురాయుళ్లను పట్టుకుని..

పొదల వద్ద యువకులు మద్యం తాగుతున్నారని తెలిసి వెళుతున్న ఎమ్మెల్యే భూమన

తిరుపతి(రవాణా), జూన్‌ 23: నగరంలోని మత్తురాయుళ్ల ఆటకట్టించేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నడుంబిగించారు. ఇందులో భాగంగా బుధవారం సాయత్రరం 7 గంటల ప్రాంతంలో ఎన్‌జీవో కాలనీలో ఆయన కాలినడకన పర్యటించారు. స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకురాగా.. ఆయన ముళ్లపొదల వద్దకు వెళ్లారు. అక్కడ దాదాపు 10మంది యువకులు గంజాయి, మద్యం తాగుతూ కనిపించారు. వాళ్ల దగ్గరకు వెళ్లగానే.. ఐదుగురు యువకులు పారిపోయారు. మిగిలిన వారిని తీసుకొచ్చి అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌కు అప్పగించారు. మత్తుకు బానిసలుగా మారవద్దని యువకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించవద్దని సీఐని ఆదేశించారు. అనంతరం ఇస్కాన్‌రోడ్‌, రుయాస్పత్రి, రామకృష్ణసర్కిల్‌, పాత ప్రసూతి ఆస్పత్రి రోడ్లలో కాలినడకన పర్యటించారు.