కాసుల గలగల

ABN , First Publish Date - 2022-05-19T06:24:05+05:30 IST

లక్ష్మీనరసింహుడి హుండీల్లో లక్ష్మీదేవి కళకళలాడుతోంది. ఉద్ఘాటన అనంతరం హుం డీలను నాలుగుసార్లు లెక్కించిన అధికారులు, 49 రోజుల్లో రూ.4.64 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.

కాసుల గలగల
లక్ష్మీనరసింహుడి దర్శనానంతరం ఆలయ వెలుపల భక్తులు

యాదగిరీశుడికి రికార్డు స్థాయిలో హుండీల ఆదాయం 

ఉద్ఘాటన అనంతరం నాలుగుసార్లు లెక్కించిన అధికారులు

49రోజుల్లో రూ.4.64 కోట్ల హుండీ ఆదాయం


యాదగిరిగుట్ట: లక్ష్మీనరసింహుడి హుండీల్లో లక్ష్మీదేవి కళకళలాడుతోంది. ఉద్ఘాటన అనంతరం హుం డీలను నాలుగుసార్లు లెక్కించిన అధికారులు, 49 రోజుల్లో రూ.4.64 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంతోపాటు వివిధ దేశాల నుంచి వచ్చే భక్తులు  అధిక మొత్తంలో కానుకులు చెల్లిస్తుండడంతో స్వామివారి హుండీల ఆదాయం రోజురోజుకూ పెరుగుతోంది. అమెరికా డాలర్లు, యూఏఈ దినామ్‌లతోపాటు బంగారు, వెండి బహుమతులను భక్తులు బహూకరిస్తున్నారు.  


రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి భక్తజనులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు అధిక మొత్తంలో సమకూరుతున్నాయి.ప్రభుత్వం పాంచనారసింహుడు కొలువైన ప్రధానాలయాన్ని దేశంలో మరెక్కడా లేని విధంగా పూర్తిగా కృష్ణరాతి శిలలతో అద్భుత శిల్పకళాధామంగా తీర్చిదిద్దింది. ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు పూర్తిచేసిన ప్రభుత్వం మార్చి 21వ తేదీనుంచి 28వ తేదీ వరకు శ్రీవైష్ణవ పాం చరాత్రాగ మ శాస్త్రరీతిలో మహాకుంభసంప్రోక్ష ణ.. ఉద్ఘాటన పర్వాలు నిర్వహించిం ది. ప్రధానాలయ ఉద్ఘాటన అనంత రం క్షేత్ర సందర్శనకు భక్తులు అధి క సంఖ్యలో తరలివచ్చి ఇష్ట దైవాల ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన యాత్రాజనులు ఇష్టదైవాల దర్శనాలు.. ఆర్జిత సేవల్లో పాల్గొని మొ క్కు కానుకలను హుండీలలో నగదు, నగల రూపంలో సమర్చించడం ఆచారం. ప్రధానాల యం, శివాలయం, కొండపైన విష్ణు పుష్కరిణి వద్ద ఆం జనేయస్వామి ఆలయం, వైకుంఠద్వారం, గండి చెరువు వద్ద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, ఉచిత అన్న ప్రసాద భవనం, కొండకింద పాతగోశాలలోని వ్రత మండపంతోపాటు పాతగుట్ట ఆలయాల్లో భక్తులు మొక్కు కానుకలు సమర్పించుకునేందుకు దేవస్థానం హుండీలను ఏర్పాటుచేసింది. ఈ హుండీలలో భక్తులు సమర్పించిన నగదు, నగలను ఆలయ అనువంశిక ధర్మకర్త, కార్యనిర్వహణాధికారుల పర్యవేక్షణలో దేవస్థాన సిబ్బంది లెక్కిస్తారు. హుండీ ఆదాయం లెక్కింపులను ఆలయ ఘాట్‌రోడ్‌లోని హరితాకాటేజ్‌ సమావేశ మం దిరంలో నిర్వహించేవారు. ప్రస్తుతం దేవస్థాన ప్రధాన కార్యాలయంలో లెక్కిస్తున్నారు. 


 21 హుండీలు

యాదగిరిక్షేత్రాన్ని సందర్శించిన భక్తులు తమ మొక్కు కానుకలు సమర్పించేందుకు వీలుగా దేవస్థాన అధికారులు ప్రధానాలయం, శివాలయం, పాతగుట్ట ఆలయాల్లో హుండీలను ఏర్పాటుచేశారు. ప్రధానాలయం లో తిరుమల తరహాలో వస్త్రంతో తయారు చేసిన హుండీ, ఇత్తడి హుండీలు రెండు, శివాలయం, కొండపైన విష్ణుపుష్కరిణి చెంత గల ఆంజనేస్వామి ఆలయం, కొండకింద వైకుంఠద్వారం, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, ఉచిత అన్నప్రసాద భవనంలో ఒక్కోటి చొప్పున, కల్యాణకట్ట లో రెండు, పాతగుట్ట ఆలయంలో సుమారు 10 హుండీలను దేవస్థాన అధికారులు ఏర్పాటు చేశారు. ప్రఽధానాలయ ఉద్ఘాటనకు ముందు తాత్కాలిక బాలాలయంలో ప్రతిష్ఠా అలంకారమూర్తుల దర్శనాలు కొనసాగిన సమయంలో 20 రోజుల నుంచి నెల రోజుల్లోపు దేవస్థాన అధికారులు స్వామివారి హుండీలను లెక్కించేవారు. స్వామి సన్నిధిలో విశేష రోజుల్లో కొన్ని పర్యాయాలు మాత్రమే హుండీ ఆదాయం కోటి రూపాయలకు పైగా సమకూరుతుండేది. 


ప్రధానాలయ ఉద్ఘాటన తర్వాత

స్వయంభువులు కొలువుదీరిన ప్రధానాల య ఉద్ఘాటన ఈ ఏడాది మార్చి 28న సంప్రదాయ పూజల తో జరిగింది. ప్రధానాలయ ఉద్ఘాటన అనంతరం మార్చి 29 న మొదటి సారి స్వామివారి సన్నిధిలోని హుండీ ఆదాయం లెక్కించారు. నాటి నుంచి మే 17వ తేదీ వరకు దేవస్థాన అధికారులు నాలుగు సార్లు భక్తులు స్వామివారికి  హుండీలలో సమర్పించిన నగదు, నగలు లెక్కించారు. 49రోజుల్లో ఇష్టదైవాలను దర్శించుకున్న భక్తులు హుండీల ద్వారా సమర్పించిన నగదు 4కోట్ల 64లక్షల 05వేల 208 రూపాయల ఆదాయం రాగా.. మిశ్రమ బంగారం 399 గ్రాములు, మిశ్రమ వెండి 9 కిలోల 300 గ్రాములు స్వామివారి ఖజానాకు సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదగిరివాసుడి ని ఆలయ ఉద్ఘాటన అనంతరం దర్శించుకున్న భక్తులు విదేశీ కరెన్సీని హుండీలలో కానుకలుగా సమర్పించారు. స్వామికి 49రోజుల్లో హుండీల ద్వారా వచ్చిన విదేశీ కరె న్సీ 1533 అమెరికా డాల ర్లు, 269 ఆస్ట్రేలియా డాలర్లు, 114 సౌదీ అరేబియా రియాల్‌, 30 యూఏఈ దినామ్‌లు, ఒకటి ఖతార్‌ రి యాల్‌, 115 కెనెడా డాలర్లు, 65 ఇంగ్లాండ్‌ పౌండ్లు, 5 సింగపూర్‌ డాలర్లు ఆలయ ఖజానాలో జమయ్యినట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా స్వామికి హుం డీ ఆదాయంతోపాటు నిత్యాదాయం సైతం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 16వ తేదీవరకు స్వామికి 12కోట్ల 81లక్షల 71వేల 164 రూపాయలు ఆలయ ఖజానాకు సమకూరింది. 


దాతలకు ప్రత్యేక సౌకర్యాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి విరాళాలు, కాటేజీల నిర్మాణానికి సహకరించే దాతల కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను దేవస్థాన ఈవో గీతారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. కాటేజీల నిర్మాణానికి, అభివృద్ధికి విరాళాలు అందజేసే దాతలకు డోనర్‌ పాలసీని రూపొందించింది. 

రూ.7.5కోట్లు, ఆ పైన విరాళం అందజేసిన దాతల ను మహారాజపోషకులుగా నిర్ణయిస్తారు. దేవస్థానంలోని వీవీఐపీ కాటేజీలో ఉచిత వసతి, సువర్ణ పుష్పార్చన, స్వామివారి శెల్లా, 10 అభిషేకం లడ్డూ ప్రసాదాలు, డోన ర్‌ ఐడీ కార్డు అందజేసి దాతతో పాటు ఆరుగురు కుటుం బ సభ్యులకు ఉచిత దర్శనం.

రూ.5కోట్లు ఆపైన విరాళం అందజేసిన దాతలను రాజపోషకులుగా గుర్తిస్తూ, వీవీఐపీ కాటేజీలో ఉచిత వసతి, సువర్ణ పుష్పార్చన, స్వామివారి శెల్లా, వేదాశీర్వచనం, 8 అభిషేకం లడ్డూ ప్రసాదాలు, డోనర్‌ ఐడీ కార్డుతో పాటు దాతతో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులకు ఉచిత దర్శనం.

రూ.2కోట్లు ఆపైన విరాళం అందజేసిన దాతలకు వీవీఐపీ కాటేజీలో ఉచిత వసతి, సువర్ణ పుష్పార్చన, స్వామివారి శెల్లా,వేదాశీర్వచనం,ఆరు అభిషేకం లడ్డూ ప్రసాదాలు, డోనర్‌ ఐడీ కార్డుతో పాటు దాతతో పాటు ఐదుగురుసభ్యులకు ఉచిత దర్శనం.

రూ.కోటి, ఆ పైన విరాళం సమర్పించిన దాతలకు వీవీఐపీ కాటేజీలో ఉచిత వసతి, సువర్ణ పుష్పార్చన, స్వామివారి శెల్లా, వేదా శీర్వచనం, డోనర్‌ ఐడీ కార్డుతో పాటు దాతతో పాటు ఐదుగురుసభ్యులకు ఉచిత దర్శనం.

రూ.25లక్షలు, ఆ పైన విరాళం అందజేసిన దాతలకు వీవీఐపీ కాటేజీలో ఉచిత వసతి, సువర్ణ పుష్పార్చన, స్వామివారి శెల్లా, వేదాశీర్వచనం, మూడు అభిషేకం లడ్డూ ప్రసాదాలు, డోనర్‌ ఐడీ కార్డుతోపాటు దాత,ఐదుగురు కుటుంబసభ్యులకు ఉచిత దర్శన.

రూ.5లక్షల విరాళం అందజేసిన దాత దంపతులను దర్శనాలకు అనుమతిస్తూ సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనం, డోనర్‌ ఐడీ కార్డులను అందజేస్తారు. 


లెక్కించి తేదీ ఆదాయం 

మార్చి 29న రూ.49,63,871

ఏప్రిల్‌ 19న రూ.1,87,17,937

మే 10న రూ.1,72,15,312

మే 17న రూ.55,08,088 

మొత్తం రూ.4,64,05208

Updated Date - 2022-05-19T06:24:05+05:30 IST