Abn logo
May 15 2021 @ 00:30AM

ట్రాఫిక్‌లో కాసుల దందా!

శుక్రవారం నగరంలో ద్విచక్ర వాహనదారులను తనిఖీ చేస్తున్న పోలీసులు


  జరిమానాలే లక్ష్యంగా కొందరు ట్రాఫిక్‌ పోలీసుల పనితీరు 

 కర్ఫ్యూ సడలింపు సమయంలో కానరాని పోలీసులు

 కొన్ని షాపులు, దుకాణాలతో నెలవారీ మామూళ్లు

అనంతపురం క్రైం, మే14: నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ప్రధానంగా శ్రీకంఠం సర్కిల్‌, సప్తగిరి సర్కిల్‌, టవర్‌క్లాక్‌, పాతూరు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యతో వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో జనసంచారం ఎక్కువగా లేకుండా కట్టడి చేయడం, ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు వాటిని మరిచి జరిమానాలే లక్ష్యంగా పనిచేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కొందరు పోలీసులు  అదనపు వసూళ్లకు పాల్పడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఇంకొందరు పోలీసులైతే షాపులు, దుకాణాలు, తోపుడుబండ్ల  వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్ల వ సూలులో నిమగ్నమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు మామూళ్లపై చూపిస్తున్న శ్రద్ధ ట్రాఫిక్‌ నియంత్రించడంపై లేదనే విమర్శలు నగరంలో జోరుగా వినిపిస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే రాజురోడ్డు, టవర్‌ క్లాక్‌ ప్రాంతంలో ప్రైవేట్‌ వాహనాలు రోడ్లపై గంటల తరబడి నిలబెట్టినా ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోరు. కానీ సాధారణ, మధ్య తరగతి వర్గాలకు చెందిన వాహనదారులు రెండు నిమిషాలు రోడ్డు ప క్కన వాహనం నిలిపితే చా లు.. రాంగ్‌ పార్కింగ్‌ పేరుతో కొం దరు ట్రాఫిక్‌ పోలీసులు ఠక్కున ఫొటో తీసి ఆన్‌లైన్‌లో జరిమానాలు విధిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇదేమనీ ప్రశ్నిస్తే రాంగ్‌ పా ర్కింగ్‌, తదితర కారణా లు చెబుతూ బెదిరిస్తున్నారు.  టార్గెట్‌ను అ ధిగమించేందుకు జరిమానాలే పరమావధిగా వ్యవహరిస్తుండటం ఆరోపణలకు దారితీస్తోం ది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా, అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేసి నా జరిమానాలు విధిస్తే తప్పులేదు. మద్యం తాగి వాహనం నడిపేవారి మత్తు దించాల్సిందే. వీటిని ఎవరూ కాదనలేరు.. కానీ జరిమానాలే పరమావధిగా నెలలో ఇన్ని డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పెట్టాలి..? ఇన్ని చలానా లు వేయాలి...? అని ఒత్తిడి చేస్తుండటంతో  కొందరు పోలీసులు తమ టార్గెట్‌లను అందుకోవడానికి వక్రమార్గాల్లో వెళ్తున్నారు. ఇదే అదనుగా భా వించి కొందరు ట్రాఫిక్‌ పోలీసులు చేతివాటం ప్రదర్శించి జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలులేకపోలేదు. జిల్లా కేంద్రంలోనే కొందరు ట్రాఫిక్‌ పోలీసుల వైఖరి ఇలా ఉండటం వాహన చోదకులకు కలవరం కలిగిస్తోంది.  కాగా కర్ఫ్యూ సడలిం పు సమయం లో ట్రాఫిక్‌ పోలీసులు పత్తా లేకుండా పోతున్నారు. దీంతో నగరంలో గంటల తరబడి ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడి వాహనచోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 


పేదలపై జులుం

జిల్లాలో ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా కొందరు ట్రాఫిక్‌, సివిల్‌ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరూ చెప్పినా వినేది లేదంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. నగరానికి, మండల కేంద్రానికి ఆయా ప్రాంతాల పరిధిలోని గ్రామాల నుంచి కూలి పనికోసం వచ్చే కూలీలు, గ్రా మీణ ప్రాంతవాసులపై వీరు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారికి ట్రా ఫిక్‌ నిబంధనలపై అవగాహన ఉండదనే ఉద్దేశంతో బలవంతంగా జ రిమానాలు విధిస్తున్నా రు. కొందరు పోలీసులైతే చేతివాటం ప్రదర్శించి జేబు లు నింపుకుంటున్నారనే వి మర్శలు లేకపోలేదు. మరి కొన్ని ప్రాంతాలలో పంచె, లుంగీలతో వస్తే చాలు వారిని జరిమానాలతో బా దేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


పార్కింగ్‌ స్థలం లేకపోవడంతోనే...

నగరంలో ఇష్టారాజ్యంగా భవనాలు, దుకాణాలు, ఆపార్ట్‌మెంట్‌లు, గృహాలను నిర్మించేస్తున్నారు. ఎక్కడా నిబంధనలు పాటించడంలేదు. కాస్తా జాగా కనిపిస్తే చాలు ఆక్రమించేసి నిర్మాణాలు చేపడుతున్నారు. కనీసం పార్కింగ్‌ స్థలాలను కూడా వదలడం లేదు. ఇలా ఎవరికి వారు పార్కింగ్‌ కోసం స్థలం కేటాయించుకోకుండా రోడ్ల వరకు నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసిన ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. తద్వారా నగరంలో వాహ నాదారులకు పార్కింగ్‌ సమస్య అధికమవుతోంది. ఏ దుకా ణానికి వెళ్లాలన్నా వాహనాలు ఎక్కడ పార్కింగ్‌ చేయాలో అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే. నగరంలో ట్రాఫిక్‌ పోలీసుల తీరు వాహనచోదకులకు చుక్కలు చూపిస్తోంది. వాహనచోదకుడికి తెలియకుండా ఆన్‌లైన్‌లో జరిమానాలు విధించేస్తున్నారు. తీరా సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్‌  చూసి ఆ వాహనాచోదకులు ఉలిక్కిపడాల్సిన దుస్థితి నెలకొంది. కొందరయితే రాంగ్‌ పార్కింగ్‌ పేరుతో వాహనాలను స్టేషన్‌కు తరలించి పలు రకాలుగా దోపిడీ చేస్తున్నారని సమాచారం. కుటుంబసభ్యులతో ద్విచక్రవాహనంపై బయ టకు వచ్చిన వాహనచోదకులు వారిని రోడ్డుపైనే వదిలేసి పోలీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. నగరంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్‌ పోలీసులు పార్కింగ్‌ స్థలాలు చూపించకుండా అడ్డదిడ్డంగా జరిమానాలు విధించి ప్రజలను దోపిడీ చేస్తున్నారని నగర ప్రజలు మండిపడితున్నారు.  మామూళ్ల మత్తులో...

నగరంలోని పలు ప్రఽధాన కూడళ్లలో తరచూ ట్రా ఫిక్‌ అంతరాయం ఏర్పడుతోంది. ప్రధానంగా టవర్‌క్లాక్‌, స ప్తగిరి సర్కిల్‌, శ్రీకంఠం సర్కిల్‌, కమలానగర్‌, ఆర్టీసీ బస్టాండ్‌, కోర్టురోడ్డు, కళ్యాణదుర్గం బైపాస్‌ రోడ్డు, పీటీసీ ఫ్లైఓవర్‌, రాంనగర్‌ ఫ్లైఓవర్‌ తదితర ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇక పండుగలు,  కొత్త సినిమాలు విడుదల నేప థ్యంలో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం కొవిడ్‌ కర్ఫ్యూ సడలింపు (ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు) సమయంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లపైనే వాహ నాలను పార్కింగ్‌ చేస్తున్నారు. మిగతా రోజుల్లో కూడా ఆయా దుకాణాలకు వచ్చే వినియోగదారుల వాహనాలతో నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. వీటిపై సంబంధిత ట్రా ఫిక్‌ పోలీసులు ఏమాత్రం దృష్టిపెట్టడం లేదు. ఎందుకంటే కొందరు ట్రాఫిక్‌ పోలీసులకు ఆయా  దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు వెళ్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. టవర్‌క్లాక్‌, సప్తగిరి సర్కిల్‌, శ్రీకంఠం సర్కిల్‌, కమలానగర్‌, పాతూరు ప్రాంతాలలో ఈ తంతు ఎక్కువగా సా గుతోందని కొందరు వ్యాపార వర్గాల నుంచి తెలిసింది. ఇ ప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాఽధికారులు స్పం దించి వీటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. 


Advertisement