శరీరాన్ని చూపించేందుకు సిద్ధపడ్డా

ABN , First Publish Date - 2022-05-25T07:33:21+05:30 IST

కాస్టర్‌ సెమెన్యా.. డబుల్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ అయిన ఈ దక్షిణాఫ్రికా స్టార్‌ అథ్లెట్‌ తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా వెల్లడించింది.

శరీరాన్ని చూపించేందుకు సిద్ధపడ్డా

ప్రపంచ అథ్లెటిక్స్‌ అధికారులపై సెమెన్యా మండిపాటు

వాషింగ్టన్‌: కాస్టర్‌ సెమెన్యా.. డబుల్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ అయిన ఈ దక్షిణాఫ్రికా స్టార్‌ అథ్లెట్‌ తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా వెల్లడించింది. కెరీర్‌ ఆరంభంలో తాను మహిళను అని నిరూపించుకునేందుకు తన ఒంటిపై ఉన్న దుస్తులను పూర్తిగా విప్పేసేందుకు కూడా సిద్ధపడ్డానని హెచ్‌బీవో రియల్‌ సోర్ట్స్‌  చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ’అప్పుడు నాకు 18 ఏళ్లు. 2009లో బెర్లిన్‌ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షి్‌పలో 800 మీటర్ల రేసులో పోటీపడి టైటిల్‌ గెలిచా.


ఆ టోర్నీలో నా ప్రదర్శన, కండర సామర్ధ్యం చూసి ప్రపంచ అథ్లెటిక్స్‌ అధికారులు నేను మహిళను కాదని భావించారు. అయితే నేను మహిళనేనని వాళ్లకు గట్టిగా చెప్పా.. కావాలంటే నా జననాంగాన్ని చూపిస్తానని అన్నా. అయినా నాలో టెస్టోస్టెరాన్‌ (పురుషుల హార్మోన్లు) స్థాయి ఎక్కువ ఉందన్న కారణంతో బలవంతంగా మెడికేషన్‌కు పంపించారు’ అని 31 ఏళ్ల సెమెన్యా చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. 2019లో నిషేధానికి ముందు వరుసగా 30 రేసుల్లో ఓటమన్నదే లేకుండా సాగిన సెమెన్యా.. 2012, 2016 విశ్వక్రీడల్లో 800 మీటర్ల రేసులో చాంపియన్‌గా నిలిచింది. ఆమె ఖాతాలో మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణాలు కూడా ఉన్నాయి. 

Updated Date - 2022-05-25T07:33:21+05:30 IST