ఏపీ మంత్రి ఇలాకాలో కుల వివక్ష

ABN , First Publish Date - 2022-01-05T00:28:26+05:30 IST

ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సొంత నియోజకవర్గంలో విద్యార్థులపై కుల వివక్ష చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది...

ఏపీ మంత్రి ఇలాకాలో కుల వివక్ష

తూర్పుగోదావరి: ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సొంత నియోజకవర్గంలో విద్యార్థులపై కుల వివక్ష చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. కె.గంగవరం మండలం బ్రహ్మపురిలో అగ్ని కుల క్షత్రియ విద్యార్థులకు ఒక పాఠశాల, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు మరో పాఠశాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. గ్రామ సర్పంచ్ సూచనలతో విద్యార్థుల మధ్య కుల విభజన చేశారని కలెక్టర్‌కు అగ్ని కుల క్షత్రియ సంఘం నాయకులు ఆరోపించారు. ఫిర్యాదు కూడా చేశారు. 



Updated Date - 2022-01-05T00:28:26+05:30 IST