ED Questions Trs Mla: ఈడీకి కీలక డాక్యుమెంట్స్ అప్పగించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-09-29T04:14:17+05:30 IST

రెండోరోజు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి)ను ఈడీ అధికారులురెండో రోజు కూడా విచారించారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి...

ED Questions Trs Mla: ఈడీకి కీలక డాక్యుమెంట్స్ అప్పగించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి

హైదరాబాద్‌ (Hyderabad): క్యాసినో కేసులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (Manchi Reddy Kishan Reddy)ను ఈడీ అధికారులు (Enforcement Directorate Officers) రెండో రోజు కూడా విచారించారు. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆయనపై  ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు సుమారు 10 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. విదేశాల్లో జరిపిన లావాదేవీలపై ఆరా తీశారు. విదేశీ టూర్‌లో జరిపిన లావాదేవీలపై ఈడీ అధికారులకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి డాక్యుమెంట్స్ సమర్పించారు. విదేశీ టూర్లపై ఈడీకి స్టేట్‌మెంట్ ఇచ్చారు. అవసరమైతే గురువారం కూడా విచారణ చేస్తామని మంచిరెడ్డికి ఈడీ అధికారులు తెలిపారు. దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 

Updated Date - 2022-09-29T04:14:17+05:30 IST