Abn logo
May 5 2021 @ 23:30PM

జీడి పరిశ్రమల బంద్‌

పలాస: కరోనా నేపథ్యంలో బుధవారం నుంచి జీడి పరిశ్రమలు బంద్‌ చేస్తున్నా మని కార్మిక సంఘ నాయకులు బొంపల్లి సింహాచలం, బొమ్మాళి తాతయ్య, కోనారి రాము, అంబటి కృష్ణమూర్తి ఒక ప్రకట నలో తెలిపారు. పరిశ్రమల్లో అన్ని పనులు నిలిపి వేశా మని,  పారిశ్రామికవాడతో పాటు పలాస ఏరియా జీడి పరిశ్రమల యాజమాన్యాలు సహక రించాలని తెలిపారు. ఈనెల మూడో తేదీన ఇరు సంఘాల నాయకులకు లేఖలు ఇచ్చామని పేర్కొ న్నారు. ఈ వ్యవహారంపై పారిశ్రామికవాడ జీడి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, కార్యదర్శి తూముల శ్రీని వాసరావు, కోశాధికారి శాసనపురి శ్రీనివాస రావు మరో లేఖ విడుదల చేశారు. లేఖ ఇచ్చిన రోజునే బాయిలింగ్‌ పనులు కార్మి కులు నిలిపి వేశారన్నారు. కార్మికుల బంద్‌కు తాము సహకరిస్తామని,  పిక్కలు పచ్చివిగా ఉండ డంతో ఎండబోతకు ఐదురోజులపాటు కళాసీలకు అనుమతులు ఇవ్వాలని కార్మిక సంఘానికి లేఖ రాశారు. 


ఏకపక్షంగా బంద్‌ తగదు

కార్మికులు, వ్యాపారుల మధ్య ఒప్పందం  మేరకు  బంద్‌ చేయాలంటే కనీసం 72 గంటల వ్యవధి ఉండాలని, ఏకపక్షంగా బంద్‌చేయడం తగదని పీసీఎంఏ అధ్య క్షుడు మల్లా సురేష్‌కుమార్‌, కార్యదర్శి కేవీ శివకృష్ణ, కోశాధికారి పి.రవికాంత్‌ ఒక ప్రక టనలో తెలిపారు. కాగా శుక్రవారం నుంచి బంద్‌ పూర్తిస్థాయిలో జరిగేలా పరిశ్రమల్లో తనిఖీలు చేస్తామని కార్మి కసంఘ అధ్యక్షుడు సింహాచలం, కార్య దర్శి తాతయ్య విలేకరులకు తెలిపారు. కాగా మరో వైపు కొంతమంది వ్యాపారులు కార్మికులతో పనిచేయిస్తున్నారు.   


Advertisement
Advertisement
Advertisement