నగదు, లాప్‌టాప్‌.. ఏది కావాలి

ABN , First Publish Date - 2021-04-13T06:25:51+05:30 IST

అమ్మఒడి పథకంలో భాగంగా 2021–22 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో అర్హులకు నగదు బదులు ల్యాప్‌టాప్‌ తీసుకోవచ్చు.

నగదు, లాప్‌టాప్‌.. ఏది కావాలి

22లోగా అమ్మఒడి అభీష్టాలను తెలపాలి : డీఈవో



ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 12: అమ్మఒడి పథకంలో భాగంగా 2021–22 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో అర్హులకు నగదు బదులు ల్యాప్‌టాప్‌ తీసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీఈవో సీవీ.రేణుక తెలిపారు. ప్రస్తుతం 8, 9, 10, 11 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు అమ్మఒడి పథకంలో నగదు సహాయం కోరుకుంటున్నారా, లేక ల్యాప్‌టాప్‌ కావాల నుకుంటున్నారా అనేది తెలుసుకునేందుకు పాఠశాలలు, కళాశాలలకు లేఖలను పం పించామన్నారు. పాఠశాల హెచ్‌ఎంలు ఈనెల 19న విద్యార్థులతో సమావేశం నిర్వ హించి లేఖలోని అంశాలను విద్యార్థులకు వివరించాలన్నారు. సంబంధిత లేఖలను విద్యార్థులు తల్లులకు, సంరక్షకులకు చూపించి వారి అభీష్టాన్ని లేఖపై రాయించి ఈనెల 22 నాటికి ప్రధానోపాధ్యాయులకు అందజేసేలా చూడాలని కోరారు.

Updated Date - 2021-04-13T06:25:51+05:30 IST