3వేలు Cash Prize వచ్చిందని మెస్సేజ్.. స్క్రాచ్ చేసి కస్టమర్‌ కేర్‌కు కాల్ చేయగా..!

ABN , First Publish Date - 2021-11-23T13:17:27+05:30 IST

మొదట నాలుగువేలు వేస్తే అవి కలిపివస్తాయని...

3వేలు Cash Prize వచ్చిందని మెస్సేజ్.. స్క్రాచ్ చేసి కస్టమర్‌ కేర్‌కు కాల్ చేయగా..!

హైదరాబాద్ సిటీ/నార్సింగ్‌ : క్యాష్‌ కార్డు గాలం వేసి వృద్ధుడిని మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు. రూ.98వేలు పోగొట్టుకున్నాడు. పుప్పాల్‌గూడ బాలాజీనగర్‌కు చెందిన సూర్యనారాయణ(64) రిటైర్డ్‌ ఉద్యోగి. తన ఫోన్‌లో ఫోన్‌పే వాడుతుంటాడు. అతడికి రూ. 3000 క్యాష్‌ప్రైజ్‌ వచ్చిందని మెస్సేజ్‌ రావడంతో స్ర్కాచ్‌ చేశాడు. అవి రాకపోవడతో గూగుల్‌లో చూసి కస్టమర్‌ కేర్‌కుఫోన్‌ చేశాడు. వారు ఫోన్‌లో ఎనీ డెస్క్‌ యాప్‌ వేసుకుని నెక్స్ట్‌ అనే ఆప్షన్‌ వాడమని, వారు లైన్‌లోకి వచ్చారు. మొదట నాలుగువేలు వేస్తే అవి కలిపివస్తాయని చెప్పడంతో నాలుగు వేలు వేశాడు. అతని ఫోన్‌లో ఎనీ డెస్క్‌ ద్వారా ప్రవేసించిన వారు రూ. 94వేలు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న సూర్యనారాయణ నార్సింగ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  


మరో కేసులో...

పుప్పాల్‌గూడలో నివాసముండే జలీల్‌ అనే వ్యక్తి ఓ కంపెనీ క్రెడిట్‌కార్డు తీసుకున్నాడు. షాపింగ్‌ చేయడానికి ఇంకా కార్డు యాక్టివ్‌ కాకపోవడంతో గూగుల్‌లో చూసి కస్టమర్‌ కేర్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయగా, వారు ఫోన్‌లో ఎనీ డెస్క్‌ యాప్‌ వేసుకుని కనెక్ట్‌ అవ్వమని చెప్పా రు. వారు అడిగినట్టు కోడ్‌లు చెప్పాడు. వారు జలీల్‌ అకౌంట్‌లో నుంచి రూ.14వేలు దోచేశారు. నగదు కట్‌కావడతో జలీల్‌ నార్సింగ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-23T13:17:27+05:30 IST