కుస్తీ పోటీల్లో విజేతలకు నగదు పురస్కారం

ABN , First Publish Date - 2022-08-12T05:20:35+05:30 IST

రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్‌ కుస్తీ పోటీల్లో సత్తా చాటిన దిబ్బిడి హైస్కూల్‌కి చెందిన ముగ్గురు విద్యార్థినులకు రూ. 30 వేలు నగదును ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, విశాఖ డెయిరీ వైస్‌ ఛైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ గురువారం అందజేశారు.

కుస్తీ పోటీల్లో విజేతలకు నగదు పురస్కారం
విద్యార్థినులకు నగదు అందజేస్తున్న కె.ధర్మశ్రీ, ఆనంద్‌కుమార్‌



డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ వితరణ 

బుచ్చెయ్యపేట, ఆగస్టు 12: రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్‌ కుస్తీ పోటీల్లో సత్తా చాటిన దిబ్బిడి హైస్కూల్‌కి చెందిన ముగ్గురు విద్యార్థినులకు రూ. 30 వేలు నగదును ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, విశాఖ డెయిరీ వైస్‌ ఛైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ గురువారం అందజేశారు. కుస్తీ పోటీలో చిన్ని మహాలక్ష్మి, ఎస్‌.దివ్య, ఎన్‌.దివ్యలు  పతకాలు సాధించిన విషయం విదితమే. వీరు ఉత్తరఖండ్‌లో జరగనున్న జాతీయస్థాయి కుస్తీ పోటీలకు హాజరయ్యేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారికి రూ.30 వేలు నగదును అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ కె.ధర్మశ్రీ మాట్లాడుతూ, క్రీడలో రాణిస్తే విద్యార్థినులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ, గ్రామీణ క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, జిల్లా కోచ్‌ నంబారు హేమసాయి, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ సుంకర శ్రీను, దిబ్బిడి సర్పంచ్‌ పెదిరెడ్ల మాణిక్యం, ఎంపీసీఎస్‌ అధ్యక్షుడు సుంకర బాజ్జి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T05:20:35+05:30 IST