Abn logo
May 14 2021 @ 00:59AM

లోకేశ్వరంలో నగదు, బంగారం చోరీ

లోకేశ్వరం, మే 13 : మండల కేంద్రం లోకేశ్వరం గ్రామానికి తోకల సంజీవ్‌ అనే వ్యక్తి ఇంట్లో బుధవారం గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం బాధితుడు సంజీవ్‌ 5 రోజుల కిందట కొడుకు పుట్టడంతో అత్తగారిల్లు అయిన నర్సాపూర్‌(జి) 9వ తేదీన కొడుకుని చూడటానికి వెళ్లారు. బుధవారం ఇంటికి వచ్చిన ఆయన చూసే సరికి ఇంటి తాళం పగిలిపోయి ఉంది. లోపలికి వెళ్లి చూడగా ఫర్నిచర్‌, సోఫాతో బీరువాలోని బట్టలు అన్ని చిందరవందరగా కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ముథోల్‌ సీఐ అజయ్‌ బాబు నిర్మల్‌ క్లూస్‌ టీమ్‌తో పాటు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులను విచారించారు. అలాగే వివరాలను సేకరించారు. ఈ చోరీలో 8 తులాల బంగారం, రూ. 45 వేల నగదును గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుకున్నట్లు లోకేశ్వరం ఎస్సై బాలకృష్ణ తెలిపారు. 


Advertisement