రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకోవాలి

ABN , First Publish Date - 2022-06-27T05:05:55+05:30 IST

రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకునేందుకే లోక్‌ అదాలత్‌ను చేపట్టినట్టు జడ్చర్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి లక్ష్మి అన్నారు.

రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకోవాలి
జడ్చర్ల కోర్టులో లోక్‌ అదాలత్‌లో కేసులను పరిష్కరిస్తున్న ప్రథమశ్రేణి న్యాయమూర్తి లక్ష్మి, అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి చైతన్య

- లోక్‌ అదాలత్‌ ప్రఽథమ శ్రేణి న్యాయమూర్తి లక్ష్మి 

జడ్చర్ల, జూన్‌ 26 : రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకునేందుకే లోక్‌ అదాలత్‌ను చేపట్టినట్టు జడ్చర్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి లక్ష్మి అన్నారు. జడ్చ ర్ల కోర్టులో ఆదివారం నిర్వహించిన మెగా లోక్‌అదాలత్‌లో భాగంగా కక్షిదారుల నుద్దేశించి ఆమె మాట్లాడుతూ కేసులో గెలుపు కోసం పోరాడితే ఒకరు గెలు స్తారని, రాజీమార్గంతో పరిష్కరించుకుంటే ఇద్దరూ గెలిచినవార వుతారని అన్నారు. మెగాలోక్‌ అదాలత్‌లో భాగంగా జడ్చర్ల, బాలానగర్‌, రాజాపూర్‌, మి డ్జిల్‌, భూత్పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలోని కేసులను పరిష్కరించారు. జడ్చర్ల ప్రథమశ్రేణి న్యాయస్థానంలో 51 క్రిమినల్‌ కేసులను పరిష్కరించారు. రెండు సివిల్‌ కేసులను రాజీ కుదుర్చుకున్నారు. మరో 24 కేసుల్లో నేరం ఒప్పుకుని రూ.55,400 జరిమానా చెల్లించారు. అదనపు ప్రథమశ్రేణి న్యాయస్థానంలో 46 క్రిమినల్‌ కేసులను అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి చైతన్య పరిష్కరించా రు. అలాగే 19 కేసుల్లో నేరం ఒప్పుకుని రూ.31,866 జరిమానా చెల్లించారు. ద్వితీయశ్రేణి న్యాయస్థానంలో సుమారు 300కు పైగా కేసులకు సంబంధించి దాదాపు రూ.4లక్షల జరిమానా విధించారు. వీటితో పాటు గృహహింస కేసులో రాజీమార్గంతో పరిష్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు మాలిక్‌ షాకీర్‌, లోక్‌అదాలత్‌ సభ్యులు ఇఫ్తెకార్‌, విశ్వేశ్వర్‌, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. 

కేసుల పరిష్కారానికి రాజీమార్గమే రాజ మార్గం

మహబూబ్‌నగర్‌ లీగల్‌, జూన్‌ 26 : జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా కేసుల పరిష్కారం- రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా న్యాయమూర్తి ఎస్‌.ప్రేమావ తి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంతోపాటు జిల్లాలోని పలుచోట్ల లోక్‌అదాలత్‌ నిర్వహించి 5057 కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదన పు జిల్లా జడ్జి పి.నీరజ, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి బోయ శ్రీనివాసులు, ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎన్‌.సంతోష్‌కుమార్‌, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి యం.సంధ్యా రాణి, ఇతర కోర్టుల న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనంతరెడ్డి, లోక్‌అదాలత్‌ మెంబర్లు, వివిధ కేసుల కక్షిదారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T05:05:55+05:30 IST