అట్రాసిటీ కేసులు క్లియర్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-09-22T10:22:00+05:30 IST

డివిజన్‌ స్థాయి రెవెన్యూ, పోలీసు అధికారులతో సమావేశమై ఆయా ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు క్లియర్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ బాధ్యులైన అధికారుల

అట్రాసిటీ కేసులు క్లియర్‌ చేయాలి

 మోనటరింగ్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌

మహారాణిపేట, సెప్టెంబరు 21: డివిజన్‌ స్థాయి రెవెన్యూ, పోలీసు అధికారులతో సమావేశమై ఆయా ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు క్లియర్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ బాధ్యులైన అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం అట్రాసిటీ కేసుల జిల్లా మోనటరింగ్‌ కమిటీతో సమావేశమయ్యారు.


ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని కేసులపై దృష్టిసారించాలని ఆదేశించారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నష్టపరిహారం సరిగా రావడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అరకు ఎమ్మెల్యే శెట్టిఫాల్గుణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన న్యాయబద్ధమైన కేసుల్లో సత్వరం చర్యలు చేపట్టాలన్నారు.


సమావేశంలో ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, రూరల్‌ ఎస్పీ కృష్ణారావు, జేసీలు వేణుగోపాలరెడ్డి, అరుణ్‌బాబు, గోవిందరావు, డీఆర్‌ఓ ఎ.ప్రసాద్‌, ఆర్డీవో పెంచల కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-22T10:22:00+05:30 IST