రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి

ABN , First Publish Date - 2022-06-27T06:32:36+05:30 IST

చట్ట పరిధిలో పరిష్కారానికి నోచుకునే కేసుల విషయంలో నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడే బదులు కక్షిదారులు రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవడం ఉత్తమమని మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధుని సూచించారు.

రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి
మాట్లాడుతున్న వరూధుని

మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధుని

మంథని, జూన్‌ 26: చట్ట పరిధిలో పరిష్కారానికి నోచుకునే కేసుల విషయంలో నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడే బదులు కక్షిదారులు రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవడం ఉత్తమమని మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధుని సూచించారు. స్థానిక కోర్టులో ఆదివారం జరిగిన మెగా లోక్‌ ఆదాలత్‌ కార్యక్రమంలో 875 సివిల్‌ కేసులను రాజీమార్గంలో కక్షిదారులు పరిష్కరించుకున్నారు. ఈసందర్భంగా న్యాయమూర్తులు వరూధుని, శ్రీధర్‌ మాట్లాడుతూ.. వివిధ రకాల కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం రాజమార్గమన్నా రు. కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-27T06:32:36+05:30 IST