యూపీలో 65 మంది విదేశీయులపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2020-04-03T12:43:32+05:30 IST

ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగ్ జమాత్ సమావేశాల్లో పాల్గొన్న 65 మంది విదేశీయులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ...

యూపీలో 65 మంది విదేశీయులపై పోలీసు కేసు

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్) : ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగ్ జమాత్ సమావేశాల్లో పాల్గొన్న 65 మంది విదేశీయులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. షహరాన్ పూర్ నగరంలో ఉన్న 57 మంది విదేశీయులు, కాన్పూర్ నగరానికి చెందిన 8 మంది విదేశీయులు ఢిల్లీ సమావేశంలో పాల్గొని వచ్చారు. 65 మంది విదేశీయులను క్వారంటైన్ కు తరలించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ సమావేశం తర్వాత 8 మంది విదేశీయులు కాన్పూర్ నగరానికి వచ్చి ఇక్కడి బాబుపుర్వా ప్రాంతంలోని ఓ మసీదులో ఉండగా పోలీసులు వారిపై కేసు పెట్టి క్వారంటైన్ కు తరలించామని కాన్పూర్ దక్షిణ ఎస్సీ అపర్ణాగుప్తా చెప్పారు. షహరాన్ పూర్ పట్టణంలో విదేశీయులతోపాటు 20 మంది స్థానికులు ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చారని, వారిపై కేసులు పెట్టామని షహరాన్ పూర్ ఎస్పీ దినేష్ కుమార్ చెప్పారు. జాన్ పూర్ జిల్లాలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీరిద్దరూ తబ్లిగ్ జమాత్ ఈవెంట్ కు హాజరయ్యారని జిల్లా కలెక్టరు దినేష్ కుమార్ సింగ్ చెప్పారు. 


Updated Date - 2020-04-03T12:43:32+05:30 IST