రోజురోజుకూ పెరుగుతున్నకేసులు

ABN , First Publish Date - 2020-10-11T11:09:44+05:30 IST

ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో రోజురోజుకూ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.

రోజురోజుకూ పెరుగుతున్నకేసులు

 కరోనాతో ఇద్దరి మృతి


( ఆంధ్రజ్యోతి,రంగారెడ్డి అర్బన్‌ ) : ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో రోజురోజుకూ కరోనా మృతుల సంఖ్య  పెరుగుతోంది. రోజుకు ఇద్దరు ముగ్గురు చొప్పున చనిపోతున్నారు. శనివారం రంగారెడ్డిజిల్లాలో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో కరోనా మృతుల సంఖ్య 278కి చేరుకుంది.


ఉమ్మడి జిల్లాలో  567 కేసులు

 ఉమ్మడి జిల్లాలో శనివారం 567 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 254 కేసులు నమోదు కాగా వికారాబాద్‌ జిల్లాలో 18 కేసులు నమోదుయ్యాయి. అలాగే మేడ్చల్‌ జిల్లాలో 295 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మూడు జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య 88,063కి చేరుకుంది. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 26 మందికి..  

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 11 కేంద్రాల్లో 268 మందికి యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించగా 26 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సీహెచ్‌సీ ఇబ్రహీంపట్నంలో ఒకరికి, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 5, ఎలిమినేడులో8, మంచాలలో ఒకటి, యాచారంలో రెండు, సీహెచ్‌సీ హయత్‌నగర్‌లో6, తట్టిఅన్నారంలో ఇద్దరికిపాజిటివ్‌ వచ్చింది. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో 18 కేసులు

షాద్‌నగర్‌అర్బన్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 18 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మొత్తం 152 మందికి పరీక్షలు నిర్వహించగా బూర్గుల పీహెచ్‌సీలో ముగ్గురు, కొత్తూర్‌ మండలంలో 9 మంది, షాద్‌నగర్‌లో 5, చించోడ్‌ పీహెచ్‌సీలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. 


చేవెళ్ల డివిజన్‌లో...

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 214 మందికి పరీక్షలు చేయగా ఇందులో 14 మందికి పాజిటివ్‌ వచ్చిందని వెద్యాధికారులు తెలిపారు.  చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 20 మందికి పరీక్షలు చేయగా 4, ఆలూర్‌ పీహెచ్‌సీలో 28 మందికి పరీక్షలు చేయగా ఎవ్వరికీ పాజిటివ్‌ రాలేదు. శంకర్‌పల్లి మండలంలో 45 మందికి పరీక్షలు చేయగా7, మొయినాబాద్‌ మండలంలో 45 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి, షాబాద్‌ మండలంలో 76 మందికి గాను ఏడుగురికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు.


శంషాబాద్‌లో...

శంషాబాద్‌: శంషాబాద్‌లో 54 మందికి కరోనా పరీక్షలు చేయగా రెండు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డాక్టర్‌ నజ్మాభాను తెలిపారు.


 వికారాబాద్‌ జిల్లాలో ... 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)/కులకచర్ల:  వికారాబాద్‌ జిల్లాలో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌లో 10 కేసులు, కులకచర్లలో 3, తాండూరులో 2, దోమలో 2, కొడంగల్‌లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. కొత్తగా నమోదైన కేసులతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2281కు చేరుకోగా,  వాటిలో 371 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 17 మంది వివిధ ఆసుపత్రుల్లో, 354 మంది హోంకేర్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.  కరోనాబారి నుంచి జిల్లాలో  ఇప్పటివరకూ 1835 మంది రికవరీ కాగా, 45 మంది మృతి చెందారు. 


కరోనా పరీక్షలు

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో శనివారం 35 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు.  శ్రీ రంగవరం పీహెచ్‌సీలో 13 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి  పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యురాలు నళిని తెలిపారు. 

Updated Date - 2020-10-11T11:09:44+05:30 IST