Revanth Reddy.. మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలపై కేసులా?

ABN , First Publish Date - 2022-10-03T21:42:00+05:30 IST

Hyderabad: టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కమలం పార్టీపై ధ్వజమెత్తారు. బీజేపీ(BJP) ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్త పాదయాత్ర చేస్తోన్న రాహుల్‌ను, మనీలాండరింగ్ విచారణ పేరుతో ఆయనను అడ్డుకునేందుకు బీజేపీ అగ్ర నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు. రాహు

Revanth Reddy.. మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలపై కేసులా?

Hyderabad: టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కమలం పార్టీపై ధ్వజమెత్తారు. బీజేపీ(BJP) ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్త పాదయాత్ర చేస్తోన్న రాహుల్‌ను, మనీలాండరింగ్ విచారణ పేరుతో ఆయనను అడ్డుకునేందుకు బీజేపీ అగ్ర నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు. రాహుల్ (Rahul) పాదయాత్రకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ (Congress) నేతలను కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని.. చివరకు  ఏమీ చేయలేక వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. ఈడీ(ED)ని వారిపైకి ఉసిగొల్పు పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ వెంట నడవకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని  తెలిపారు. ఈడీ నోటీసుల పేరుతో కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిపించడం.. వారిని భయభ్రాంతులకు గురిచేసి బీజేపీలో చేర్చుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ  ఈడీని ఎలక్షన్ డిపార్ట్‌మెంట్‌గా మార్చిందని పేర్కొన్నారు.

Updated Date - 2022-10-03T21:42:00+05:30 IST