4 రోజుల్లో 41 వేల మందిపై కేసులు!

ABN , First Publish Date - 2021-04-16T09:17:40+05:30 IST

రాష్ట్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై పోలీసులు గడిచిన నాలుగు రోజుల్లో (ఈ నెల 12 నుంచి 15 వరకు) 41,249 కేసులు నమోదు చేశారు. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న

4 రోజుల్లో 41 వేల మందిపై కేసులు!

మాస్కులు ధరించని వారిపై పోలీసుల కొరడా 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై పోలీసులు గడిచిన నాలుగు రోజుల్లో (ఈ నెల 12 నుంచి 15 వరకు) 41,249 కేసులు నమోదు చేశారు. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న హైదరాబాద్‌లోనూ మాస్క్‌ నిబంధనను ఉల్లంఘిస్తున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. ఇక్కడ 15,230, రాచకొండలో 3067,  సైబరాబాద్‌లో 948 చొప్పున కేసులు నమోదయ్యాయి. మాస్కులు ధరించని వారిని గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.


కరోనా రోగులకు వైద్యం చేయండి: ఐఎంఏ

కరోనా సెకండ్‌వేవ్‌లో వైరస్‌ బారిన పడుతున్న వారికి ప్రైవేటు ఆస్పత్రులు దయతో వైద్యం చేయాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బీఎన్‌ రావు కోరారు. మానవతా దృక్పథంతో తక్కువ ఫీజులు తీసుకొని, వారికి బాసటగా నిలవాలని కోరారు. 

Updated Date - 2021-04-16T09:17:40+05:30 IST