ఎమ్మెల్సీని అడ్డుకున్న సంఘటనలో 20 మందిపై కేసులు

ABN , First Publish Date - 2020-07-05T10:58:02+05:30 IST

కాశినాయన మండలంలోని నర్సా పురం, పాపిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన 20 మందిపై శనివారం కేసులు నమోదు చేసినట్లు పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు

ఎమ్మెల్సీని అడ్డుకున్న సంఘటనలో 20 మందిపై కేసులు

కాశినాయన జులై 4: కాశినాయన మండలంలోని నర్సా పురం, పాపిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన 20 మందిపై శనివారం కేసులు నమోదు చేసినట్లు పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు. సీఐ వివరాల మేరకు.. స్థానికఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి శుక్రవారం నర్సాపురం, ఓబుళాపురం గ్రామాల్లో సచివాలయ భవనాలకు భూమిపూజ చేసేందుకు బయలుదేరారు. పాపిరెడ్డి పల్లె గ్రామస్థులు ఓబుళాపురం వద్ద, నర్సాపురం వారు అదేగ్రామంలోఎమ్మెల్సీ కారును అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ పీఏ శివారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నర్సాపురంలో టీడీపీ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి, కె.సుబ్బారెడ్డితో పాటు మరో పదిమందిపైనా, పాపిరెడ్డిపల్లెలో షేక్‌ మహబూబ్‌వలి, షేక్‌ ముంతాజ్‌ (భర్త ఖాదర్‌బాషా) సిద్ధమూర్తి రఘురామిరెడ్డి, జయరామిరెడ్డిలతోపాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో మరికొందరి పేర్లు కూడా జతచేస్తారన్నారు.


ప్రశ్నిస్తే అక్రమ కేసులా: రెడ్యం

నర్సాపురంలో ఊరికి దూరంగా గ్రామ సచివాయం నిర్మించడం సమంజసం కాదని టీడీపీ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి ప్రశ్నిస్తే పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడం దారుణమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీలో ప్రజా బలం కలిగిన నాయ కులను అణగదొక్కాలనే దురు ద్దేశ్యంతోనే  వైసీపీ నాయకులు కుట్రలు పన్ని అక్రమ  కేసులు పెడుతున్నారన్నారు. ప్రజలకు అందుబాటులో గ్రామ సచివాలయం నిర్మించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-07-05T10:58:02+05:30 IST