సూర్యాపేట: ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్వపల్లి మండలంలో పర్సాయపల్లి, అర్వపల్లి మండలకేంద్రం, కాసర్లపాడు, కొమ్మాల గ్రామాల్లో 42వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. పాదయత్రలో భాగంగా కొమ్మాలలో ఆమె మాట ముచ్చట నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మహిళ సంఘాలకు పావలా వడ్డీ, సున్నా వడ్డీ ఇస్తానని మహిళలను మోసం చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణగా మారుస్తానంటూ అప్పుల తెలంగాణ మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో 4లక్షల కోట్లు అప్పులు చేసి ఒక్కొక్కరిపై రూ.4లక్షల అప్పు భారం మోపారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ రాజ్యమేలుతోందని, ఇసుక ఆక్రమ రవాణా అరికట్టకపోతే రాష్ట్రం ఎడారిగా మారే అవకాశం ఉందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి