కరోనా ప్రచారంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-03-27T09:06:27+05:30 IST

ఆరోగ్యంగా ఉన్న యువకుడికి కరోనా వచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై చిత్తూరు జిల్లా పలమనేరులో కేసు...

కరోనా ప్రచారంపై కేసు నమోదు

పలమనేరు రూరల్‌, మార్చి 26 : ఆరోగ్యంగా ఉన్న యువకుడికి కరోనా వచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై చిత్తూరు జిల్లా పలమనేరులో కేసు నమోదైంది. సీఐ శ్రీధర్‌ కథనం మేరకు... పలమనేరుకు చెందిన ఓ వ్యాపారి కుమారుడు దుబాయ్‌ నుంచి ఈ నెల 15న వచ్చాడు. వైద్య సిబ్బంది అతడికి పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. 14 రోజుల పాటు ఇంటినుంచి బయటకు రాకూడదని సూచించడంతో అతడు ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఆ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నాడని బుధవారం సోషల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో ఆ  వ్యాపారి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పుడు ప్రచారానికి కారకులైన గంగవరం మండలం కొత్తపల్లెకు చెందిన పలువురిపై కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2020-03-27T09:06:27+05:30 IST