Hyderabad: ఐదుగురు జీఎస్టీ అధికారులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-07-07T17:36:31+05:30 IST

ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Hyderabad: ఐదుగురు జీఎస్టీ అధికారులపై కేసు నమోదు

హైదరాబాద్: ఐదుగురు జీఎస్టీ (GST) అధికారులపై హైదరాబాద్ పోలీసులు(Hyderabad police) కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారంటూ ఓ మహిళ ఇచ్చిన  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త సత్య శ్రీధర్ రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదలు అనంతరం శ్రీధర్ రెడ్డి భార్య రాఘవి రెడ్డిని అధికారులు అక్రమంగా నిర్బంధించారు. ఫిబ్రవరి 27, 2019 రోజున తనని సెర్చ్ ఆపరేషన్ పేరుతో నిర్భదించిన అధికారులపై నేషనల్ మహిళ కమిషన్‌కు రఘవిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసును నేషనల్ మహిళా కమిషన్ నుండి హైదరాబాద్ పోలీసులకు సిఫార్స్ చేయడం జరిగింది. బాధితురాలి వద్ద హైదరాబాద్ పోలీసులు నుండి వివరాలు సేకరించారు. ఐదుగురు అధికారులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి, ఇసాబెల్లా, ఆనంద్ కుమార్, కుచ్‌లపై పోలీసులు ఎప్‌ఐఆర్ నమోదు చేశారు. గతంలోనే బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. కాగా ఇప్పటికే బొల్లినేని గాంధీ , చిలక సుధా సస్పెన్షన్‌లో ఉన్నారు.  బోలినెని గాంధీపై గతంలో నమోదైన కేసు వివరాల కోసం పంజాగుట్ట పోలీసులు సీబీఐని ఆశ్రయించారు. 

Updated Date - 2022-07-07T17:36:31+05:30 IST