దారి తప్పిన ‘గురువు’

ABN , First Publish Date - 2022-08-11T06:05:38+05:30 IST

దారి తప్పిన ‘గురువు’

దారి తప్పిన ‘గురువు’

విద్యార్థినిలతో అసభ్య ప్రవర్తన

ఆగ్రహంతో చితకబాదిన తల్లిదండ్రులు


పోచమ్మమైదాన్‌(వరంగల్‌), ఆగస్టు 10: విద్యార్థినిలను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు గతి తప్పాడు. విద్యాబుద్ధులు చెప్పి ఆదర్శంగా నిలవాల్సిందిపోయి దారి తప్పాడు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ  ఘటన వరంగల్‌ జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఇంతేజార్‌గంజ్‌ సీఐ మల్లేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌  ప్రాంతంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బండి మనోహర్‌.. సోషల్‌ టీచర్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌) పనిచేస్తున్నాడు. విద్యార్థినులతో మనోహర్‌ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలలో విధుల్లో ఉన్న మనోహర్‌ను నిలదీసి, చితకబాదారు. సదరు ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమకు పిల్లలు చెప్పారని, ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసిన అనంతరం ఇంతేజార్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫి ర్యాదు మేరకు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లేష్‌ తెలిపారు. ఈ సంఘటనపై స్పందించిన డీఈవో వాసంతి గురువారం సంబంధిత పాఠశాల హెచ్‌ఎం లచ్చిరాంనాయక్‌ను విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నివేదిక అనంతరం సద రు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2022-08-11T06:05:38+05:30 IST