విగ్రహాల ధ్వంసం కేసు సీబీఐకి అప్పగించాలి

ABN , First Publish Date - 2020-02-24T09:21:04+05:30 IST

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 23 దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన విచారణను సీబీఐకి అప్పగించాలని పరిపూర్ణానంద స్వామీజీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రీయ హిందూసేన

విగ్రహాల ధ్వంసం కేసు సీబీఐకి అప్పగించాలి

  • పరిపూర్ణానంద స్వామీజీ

రాజానగరం, ఫిబ్రవరి 23: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 23 దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన విచారణను సీబీఐకి అప్పగించాలని పరిపూర్ణానంద స్వామీజీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రీయ హిందూసేన ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఆదివారంరాత్రి జరిగిన సనాతన ధర్మ పరిరక్షణ సభలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం ఘటనతో పాటు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరిగిన ఉదంతాలను గుర్తుచేశారు. ఇవన్నీ మతిస్థిమితం లేనివారే చేశారని పోలీసులు చెబుతున్నారని, మతిస్థిమితం లేనివారా? మత స్థిమితంలేని వారా? ఎవరు చేశారో వాస్తవాలు వెలుగుచూడాలంటే సీబీఐకి అప్పగించాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం సీబీసీఐడీ దర్యాప్తు జరుపుతున్నా 15 రోజులుగా నిందితులను గుర్తించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం వీడని పక్షంలో మార్చి 1న పిఠాపురంలో 30వేల మందితో సహస్ర కలశాలతో అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పురాని పక్షంలో దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఇందుకు సహకరిస్తానని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సభలో ప్రకటించారు. మోదీ, అమిత్‌షాలకు ప్రాణగండం ఉందని మదర్సాల్లో చర్చ జరుగుతోందని.. ముల్లా చేసిన ప్రకటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని, మసీదులు, చర్చిలపై ఈ విషయమై నిఘా ఉంచాలని స్వామీజీ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-02-24T09:21:04+05:30 IST