24 గంటల్లో ఛేదించారు

ABN , First Publish Date - 2021-11-20T04:37:52+05:30 IST

మణుగూరు ఏరియాలోని పీవీ కాలనీ ప్రధాన కూడాలిలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ద్వంసం చేసిన వ్యక్తిని మణుగూరు పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

24 గంటల్లో ఛేదించారు
సమావేశంలో మాట్లాడుతున్నఏఎస్పీ శబరీష్‌

జయశంకర్‌ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన మణుగూరు ఏఎస్పీ శబరీష్‌

మణుగూరు, నవంబరు 19: మణుగూరు ఏరియాలోని పీవీ కాలనీ ప్రధాన కూడాలిలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ద్వంసం చేసిన వ్యక్తిని మణుగూరు పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించి మణుగూరు ఏఎస్పీ శబరీష్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పీవీకాలనీలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్థరాత్రి ధ్వంసం చేశారు. దీనిపై టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు మేరకు గురువారం సీఐ ముత్యం రమేష్‌ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన సీఐ మూడు బృందాలుగా వీడిపోయి 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితున్ని అరెస్ట్‌ చేశారు. విచారణలో నిందితుడు తోలెం రామకృష్ణ కుటుంబ కలహాల కారణంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు తెలిపారు. నిందితుడుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ ముత్యం రమేష్‌, ఎస్‌ఐ నరేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-20T04:37:52+05:30 IST