వాట్సప్‌లో మహిళకు కరోనా మెసేజ్‌లతోపాటు.. ఓ డాక్టర్ అకృత్యమిదీ..!

ABN , First Publish Date - 2020-03-22T17:50:36+05:30 IST

వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్‌‌పై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

వాట్సప్‌లో మహిళకు కరోనా మెసేజ్‌లతోపాటు.. ఓ డాక్టర్ అకృత్యమిదీ..!

లైంగిక వేధింపులకు పాల్పడ్డ డాక్టర్‌పై కేసు 

లంగర్‌హౌజ్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్‌‌పై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన ఓ గృహిణి ఈ నెల 9న టోలిచౌకిలోని ఆర్పీస్కేన్‌ అండ్‌ ల్యాబ్‌కు వైద్యుల సూచన మేరకు రక్తపరీక్షల కోసం వెళ్లారు.  డాక్టర్‌ జిలానీ ప్రిస్ర్కిప్సన్‌‌పై ఉన్న ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా ఆ మహిళను వేధించడం ప్రారంభించాడు.  అంతేకాక వాట్సాప్‌లో కరోనా వైరస్‌ మెసేజ్‌లతో పాటు అశ్లీల ఫొటోలను పోస్టు చేశాడని బాధితురాలి భర్త గోల్కొండ పోలీసులకు తెలిపాడు. దీంతో తన భార్య డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-22T17:50:36+05:30 IST