Gandhi lookalike asura: హిందూ మహాసభపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2022-10-04T16:55:49+05:30 IST

మహాత్మా గాంధీని అసురుడిగా చిత్రించినందుకు హిందూ మహాసభపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు....

Gandhi lookalike asura: హిందూ మహాసభపై పోలీసు కేసు

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): మహాత్మా గాంధీని అసురుడిగా చిత్రించినందుకు హిందూ మహాసభపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గా విగ్రహం పాదాల వద్ద అసుర (రాక్షసుడు)కి బదులుగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఉంచినందుకు అఖిల భారతీయ హిందూ మహాసభపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం పూజా వేదికపై గాంధీ విగ్రహాన్ని తొలగించారు.కాగా గాంధీని దుర్మార్గుడిగా చిత్రీకరించడమే ఈ కసరత్తు ఉద్ధేశమని అఖిల భారతీయ హిందూ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి అన్నారు.కోల్‌కతాలోని( Kolkata) హిందూ మహాసభ యొక్క పండల్‌లో(Hindu Mahasabhas pandal) మహాత్మా గాంధీని(Mahatma Gandhi) మహిషాసురుడిగా చిత్రీకరించడం వివాదానికి(controversy) దారితీసింది.


అఖిల భారతీయ హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజా పండల్‌లో మహాత్మా గాంధీని పోలిన అసురుడిగా చిత్రీకరించారు.దీనిపై వివాదం చెలరేగడంతో హోం మంత్రిత్వ శాఖ ఒత్తిడి మేర పూజ నిర్వాహకులు గాంధీ చిత్రాన్ని మార్చారు. బెంగాల్  హిందూ మహాసభ చేసిన పనిని పలు పార్టీల నేతలు ఖండించారు.

Updated Date - 2022-10-04T16:55:49+05:30 IST