మారేడుపల్లి న్యూక్లబ్‌ కమిటీసభ్యులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-06-01T10:52:25+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను బ్లాక్‌లో విక్రయించిన క్లబ్‌ అధ్యక్షుడితోపాటు మరో ఏడుగురు కమిటీసభ్యులపై

మారేడుపల్లి న్యూక్లబ్‌ కమిటీసభ్యులపై కేసు నమోదు

మారేడుపల్లి, మే 31(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను బ్లాక్‌లో విక్రయించిన క్లబ్‌ అధ్యక్షుడితోపాటు మరో ఏడుగురు కమిటీసభ్యులపై మారేడుపల్లి పోలీసులు శనివారం సాయంత్రం కేసులు నమోదు చేశారు. న్యూఫ్యామిలీ క్లబ్‌లో లాక్‌డౌన్‌ సమయంలో అక్రమ విక్రయాలు జరిగాయని పోలీసులకు రమేశ్‌ అనే వ్యక్తి ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎక్సైజ్‌ పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవటంతో నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌కు శనివారం రమేష్‌ ఫిర్యాదు చేశాడు. వెంటనే డీసీపీ మారేడుపల్లి సీఐ మట్టయ్యకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో న్యూక్లబ్‌ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్‌తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని అడ్మిన్‌ ఎస్‌ఐ రవి తెలిపారు.


లాక్‌డౌన్‌లో న్యూక్లబ్‌ను తెరవలేదు: అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్‌

మారేడుపల్లి న్యూక్లబ్‌లో లాక్‌డౌన్‌ సమయంలో మద్యాన్ని బ్లాక్‌లో అమ్మినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజంలేదు. సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసుల బృందం క్లబ్‌లో తనిఖీలు చేపట్టి రికార్డు ప్రకారమే మద్యం నిల్వలున్నట్లు సర్టిఫికెట్‌ ఇ చ్చింది. కొందరు పనిగట్టుకుని క్లబ్‌పై చేస్తున్న ఆరోపణలు అవాస్తం.

Updated Date - 2020-06-01T10:52:25+05:30 IST