కార్వీ సీఎండీ పార్థసారథి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-25T08:17:28+05:30 IST

బ్యాంకులకు రుణాల ఎగవేత, నిధుల దారి మళ్లింపు వ్యవహారంలో కార్వీ స్టాక్‌ బ్రోకిం గ్‌ లిమిటెడ్‌ (కేఎ్‌సబీఎల్‌) సీఎండీ సి పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. ఆయనను బెంగళూరులో అరెస్ట్‌ చేసి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు ఈడీ తెలిపింది....

కార్వీ సీఎండీ పార్థసారథి అరెస్ట్‌

 రూ.2,873 కోట్ల  మనీలాండరింగ్‌ ఈడీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): బ్యాంకులకు రుణాల ఎగవేత, నిధుల దారి మళ్లింపు వ్యవహారంలో కార్వీ స్టాక్‌ బ్రోకిం గ్‌ లిమిటెడ్‌ (కేఎ్‌సబీఎల్‌) సీఎండీ సి పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. ఆయనను బెంగళూరులో అరెస్ట్‌ చేసి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న పార్థసారథిని త్వరలోనే కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని పేర్కొంది. ఇన్వెస్టర్ల షేర్లను తాకట్టుపెట్టి నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందారని ఈడీ వివరించింది. హెచ్‌డీఎ్‌ఫసీ నుంచి రూ.329 కోట్లు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నుంచి రూ.137 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రూ.562 కోట్ల రుణం తీసుకుని.. వాటిని దారిమళ్లించారని వెల్లడించింది. ఆ గ్రూప్‌ కంపెనీ అయిన కార్వీ రియల్టీ ఇండియా లిమిటెడ్‌ (కేఆర్‌ఐఎల్‌) ఖాతాలో రూ.1,096 కోట్లను జమచేశారని, ఆ నిధులతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో బయటకు వచ్చిందని తెలిపింది. ఈ వ్యవహారంలో మొత్తంగా 2,873 కోట్ల మనీలాండరింగ్‌ జరిగిందని వివరించింది.  

Updated Date - 2022-01-25T08:17:28+05:30 IST