కార్వీ ఎండీ పార్థసారథికి 5 రోజులపాటు ఈడీ కస్టడీ

ABN , First Publish Date - 2022-01-24T23:52:05+05:30 IST

కార్వీ ఎండీ పార్థసారథిని 5 రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది. ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది.

కార్వీ ఎండీ పార్థసారథికి 5 రోజులపాటు ఈడీ కస్టడీ

హైదరాబాద్: కార్వీ ఎండీ పార్థసారథిని 5 రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది. ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. మంగళవారం నుంచి ఐదు రోజులపాటు ఈడీ ప్రశ్నించనుంది. ప్రస్తుతం పార్థసారథి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. మనీలాండరింగ్‌ వ్యవహారంపై ఈడీ ప్రశ్నించనుంది. గతేడాది సెప్టెంబరులో పార్థసారథిని ఈడీ ప్రశ్నించింది. రూ.3వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు కార్వీ ఎండీ పార్థసారథి ఆరోపణలున్నాయి. ఈ రోజు ఉదయం కార్వీ ఎండీ పార్థసారథిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా అరెస్ట్ చేశారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట కార్వీ మోసాలకు పాల్పడ్డారు. కస్టమర్ల షేర్లు తనఖా పెట్టి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.500 కోట్లు రుణం పొంది చెల్లించకుండా ఎగ్గొట్టారని అభియోగాలు ఉన్నాయి. స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ద్వారా కష్టమర్లు షేర్‌లు కొనుగోలు చేశారు. నిధులను తన స్వంత అకౌంట్‌లకు కార్వీ సంస్థ  ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు గుర్తించారు. 

Updated Date - 2022-01-24T23:52:05+05:30 IST