కార్వీ మోసం కేసులో రెండో రోజు ఈడీ విచారణ

ABN , First Publish Date - 2022-01-28T18:31:50+05:30 IST

హైదరాబాద్: కార్వీ మోసం కేసులో రెండో రోజు శుక్రవారం ఈడీ విచారణ మొదలయ్యింది.

కార్వీ మోసం కేసులో రెండో రోజు ఈడీ విచారణ

హైదరాబాద్: కార్వీ మోసం కేసులో రెండో రోజు శుక్రవారం ఈడీ విచారణ మొదలయ్యింది. కార్వీ ఎండి పార్థసారధితో పాటు సిఎఫ్‌వో కృష్ణహరిలను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రూ. 2,873 కోట్ల మోసాలకు పాల్పడినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. కార్వీ గ్రూప్ నుంచి 14 షెల్ కంపెనీలకు ఈ నగదు మొత్తం బదిలీ చేసినట్లు నిగ్గు తేల్చింది. ఇప్పటికే రూ. 7వందల కోట్లు పార్థసారధికి చెందిన షేర్ హోల్డింగ్‌ను ఈడీ సీజ్ చేసింది. మిగిలిన రూ. 2వేల కోట్లు ఎక్కడకు తరలించారన్నదానిపై పార్థసారధి, కృష్ణహరిలను విచారణ చేస్తున్నారు. విదేశాలకు నగదు తరలించి ఉంటారన్న అనుమానంతో ఆధారాలు సేకరిస్తున్నారు. రూ. 2వేల కోట్లు ఏ విధంగా దారి మళ్లించారనే దానిపై ఈడి దృష్టి సారించింది.

Updated Date - 2022-01-28T18:31:50+05:30 IST