Floods: రోడ్లపై నీటమునిగిన కార్లు...వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-07-31T17:43:31+05:30 IST

జార్ఖండ్ రాష్ట్ర రాజధాని నగరమైన రాంచీ నగరంలో శనివారం కురిసిన భారీవర్షాల వల్ల రోడ్లపై కార్లు నీటమునిగాయి....

Floods: రోడ్లపై నీటమునిగిన కార్లు...వీడియో వైరల్

రాంచీ (జార్ఖండ్): జార్ఖండ్ రాష్ట్ర రాజధాని నగరమైన రాంచీ నగరంలో శనివారం కురిసిన భారీవర్షాల వల్ల రోడ్లపై కార్లు నీటమునిగాయి. రాంచీ నగరానికి వరదనీటి విపత్తు ఏర్పడింది. గత 24 గంటల్లో అతి భారీవర్షం కురువడంతో రోడ్లన్నీ నదులుగా మారాయి. వరదనీరు పోయే మార్గం లేక రోడ్లపై నిలబడటంతో కార్లు పూర్తిగా మునిగాయి. ఐదు రోజుల నుంచి జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నగరంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై పారుతున్న వరదనీటిలో కార్లు మునిగిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. 

Updated Date - 2021-07-31T17:43:31+05:30 IST