పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టండి

ABN , First Publish Date - 2022-07-07T07:33:18+05:30 IST

మన ఊరు మన బడి కార్యక్రమంలోచేపడుతున్న పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఈడబ్ల్యూఐడీఎస్‌ రాష్ట్ర చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి అన్నారు.

పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టండి
పనులను పరిశీలిస్తున్న స్టేట్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

ఈడబ్ల్యూఐడీఎస్‌ రాష్ట్ర చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి

కుభీర్‌, జూలై6 :  మన ఊరు మన బడి కార్యక్రమంలోచేపడుతున్న పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఈడబ్ల్యూఐడీఎస్‌ రాష్ట్ర చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నిగ్వా, న్యూసాంవ్లీ, పార్డి(కే), పాఠశా లల్లో చేపడుతున్న నూతన భవనాలు, అదనపు గదుల నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. గుత్తేదారులకు సంబంధిత శాఖ అధికారులకు పనులపై సూచలను సలహాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ విద్యార్థులకు మంచి వసతులతో ఆపటు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. ముధోల్‌ నియోజక వర్గంలో 112 పాఠ శాలలో అభివృద్ధి కోసం మనఊరు మనబడిలో ఎంపిక చేయడం జరిగిం దన్నారు. మండలంలోని నిగ్వా పాఠశాలలో రూ. 87లక్షలు, న్యూసాంవ్లీలో రూ. 25లక్షలు, పార్డికే లో రూ. 26లక్షలతో పనులు పూర్తి చేసి విద్యార్థులకు వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎమ్‌సీ, పీఏసీఎస్‌ చైర్మన్‌లు కందుర్‌ సంతోష్‌, గంగాచరణ్‌, నాయకులు తూం రాజేశ్వర్‌, ఎన్నిల అనీల్‌, సాతం రవికుమార్‌, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ రాములు, ఎంఈవో చంద్రకాంత్‌, ఎంపీడీవో రమేష్‌, తహసీల్దార్‌ విశ్వంబర్‌, ఎంపీవో సాయిప్రసాద్‌, వైస్‌ ప్రసిడెంట్‌ మోహియోద్దిన్‌, సంజయ్‌కుమార్‌, సాయన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T07:33:18+05:30 IST