ఐదో విడత సర్వే పక్కాగా చేపట్టండి

ABN , First Publish Date - 2020-06-03T10:34:37+05:30 IST

కోవిడ్‌-19 ఐదో విడత సర్వే పక్కాగా నిర్వహించాలని, దూర ప్రాంతాలను వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు చేపట్టాలని ..

ఐదో విడత సర్వే పక్కాగా చేపట్టండి

రేగిడి, జూన్‌ 2: కోవిడ్‌-19 ఐదో విడత సర్వే పక్కాగా నిర్వహించాలని, దూర ప్రాంతాలను వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రత్యేకాధికారి పీఎల్‌ ప్రసాదరావు పేర్కొన్నారు. మండల పరిషత్‌ కార్యా లయం, రేగిడి పీహెచ్‌సీలో మంగళవారం వేర్వేరుగా వైద్య సిబ్బంది, కోవిడ్‌ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈవోపీఆర్డీ ప్రభాకర రావు, రేగిడి పీహెచ్‌సీ వైద్యాధికారి ఆశ తదితరులు పాల్గొన్నారు.


ఇదిలా ఉండగా దేవుదళ, ఉంగరాడమెట్ట పునరావాస కేంద్రాల్లో ఉన్న 115 మందిని మంగళవారం వారి స్వగ్రామాలకు పంపించారు. 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి అయి తుది వైద్య పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టు రావడంతో అధికారుల ఆదేశాల మేరకు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉంగరాడ మెట్ట బాలయోగి గురుకుల పాఠశాల కేంద్రంలో ఉన్న 80 మంది వలసకార్మికులకు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించి శాంపిళ్లను సేకరించారు. 


 పోలాకి: ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కరోనా నియంత్రణకు దోహదపడుతుందని పోలాకి ఆరోగ్య కేంద్ర వైద్య పరిశీలకురాలు ఉషాకమలాశ్రీ అన్నారు. మంగళవారం దీర్గాశి, జ.నావానిపేట, కింజరాపువానిపేట, తోటాడ, గొల్లలవలస గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. ఆమె వెంట దాసరివిజయలక్ష్మి, పల్లిఆదిలక్ష్మి, గ్రామ వలంటీర్లు పాల్గొన్నారు. 


 మెళియాపుట్టి: పునరావాస కేంద్రంలో ఉంటున్నవారు పరిశుభ్రంగా ఉండాలని  మండల ప్రత్యేక అధికారి భవాని శంకర్‌ తెలిపారు. మంగళవారం పెద్దమడి పునరావాస కేంద్రా న్ని పరిశీలించారు. భౌతిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించాలన్నారు. అనంతరం 5 విడత ఇంటింటి సర్వేపై కేరశింగి సచివా లయంలో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. 


బైదలాపురం(పాతపట్నం): కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా చేపడుతున్న 5వ విడత ఆరోగ్య సర్వేను సక్రమంగా నిర్వహించాలని బైదలాపురం పీహెచ్‌సీ వైద్యాధి కారి  జె.భార్గవి అన్నారు. పీహెచ్‌సీలో సిబ్బందితో మంగళవా రం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈ వో ధర్మారావు, శేఖర్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


సారవకోట, మే 2: తర్లి గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహంలో పునరావాసం పొందిన 88 మంది వలస కూలీలను వారి స్వగ్రామాలకు సోమవారం రాత్రి తరలించినట్లు తహసీల్దార్‌ బి.రాజమోహన్‌ మంగళవారం తెలిపారు. వీరికి కరోనా తుది పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టు రావడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పంపామన్నారు.


Updated Date - 2020-06-03T10:34:37+05:30 IST