Horse Collapsed : పాపం గుర్రం.. ఎండ తట్టుకోలేక నడిరోడ్డుపై..

ABN , First Publish Date - 2022-08-12T22:44:40+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా(USA) వాసులు వేసవితాపాన్ని(Heatwaves) తాళలేక విలవిల్లాడుతున్నారు. అక్కడ

Horse Collapsed : పాపం గుర్రం.. ఎండ తట్టుకోలేక నడిరోడ్డుపై..

న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికా(USA) వాసులు వేసవితాపాన్ని(Heatwaves) తాళలేక విలవిల్లాడుతున్నారు. అక్కడ మండుటెండల తీవ్రతకు అద్దంపట్టే ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తీవ్ర వేడిమిని తట్టుకోలేక గుర్రపు బగ్గీని లాక్కెళ్లే ఒక అశ్వం(Carriage Horse) నడిరోడ్డుపైనే కుప్పకూలింది. గంటసేపటివరకు పైకిలేవలేకపోయింది. పోలీసులు వచ్చిన గుర్రానికి ఉన్న బెల్టులు తొలగించారు. నీళ్లతో గుర్రాన్ని తడిపారు. ఆ తర్వాత తేరుకొని నిలబడింది. గుర్రం పరిస్థితిని చూసినవారంతా చలించిపోయారు. మాన్‌హట్టన్‌లోని(Manhattan) హెల్స్ కిచెన్ ఏరియాలో ఈ ఘటన బుధవారం జరిగింది. జంతుప్రేమికులను ఆవేదనకు గురిచేస్తున్న ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి విధానాలకు(గుర్రపు బగ్గీ) స్వస్తి పలకాలని ఎక్కువమంది సూచించారు.


ఈ ఘటనపై పెటా(PETA) (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) స్పందిస్తూ గుర్రపు బగ్గీలను నిషేధించాలని డిమాండ్ చేసింది. పెద్ద నగరాలు గుర్రాల జీవనానికి అనువుకాదని పేర్కొంది. వాహనాలు, మనుషులు, వాతావరణం, ఇతర అంశాల ప్రభావంతో అవి(గుర్రాలు) ఎప్పుడూ ప్రమాదాల మధ్యలోనే బతుకుతున్నాయని పేర్కొంటూ పెటా ట్వీట్ చేసింది.



Updated Date - 2022-08-12T22:44:40+05:30 IST