చెక్కతో ట్రెడ్‌మిల్‌ తయారీ.. ఇతడి ప్రతిభ చూస్తే.. వాహ్వా! ఏం ఐడియా గురూ.. అని అంటారు..

ABN , First Publish Date - 2022-03-18T22:22:12+05:30 IST

టి ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మనుషులు చేసే పనులు.. ప్రస్తుతం యంత్రాలు చేస్తున్నాయి. దీంతో చాలా మంది శారీరక కష్టాన్ని తగ్గించి..

చెక్కతో ట్రెడ్‌మిల్‌ తయారీ.. ఇతడి ప్రతిభ చూస్తే.. వాహ్వా! ఏం ఐడియా గురూ.. అని అంటారు..

నేటి ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మనుషులు చేసే పనులు.. ప్రస్తుతం యంత్రాలు చేస్తున్నాయి. దీంతో చాలా మంది శారీరక కష్టాన్ని తగ్గించి.. సుఖానికి ఎక్కువగా అలవాటు పడ్డారు. దీనికి తోడు నిర్మాణ రంగం, వస్తువుల తయారీ విధానంలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. అయితే ఎన్ని మార్పులు వచ్చినా.. పాతతరం ఇంజినీరింగ్ వ్యవస్థకు సాటి రావనే చెప్పాలి. ఇప్పుడంటే అన్ని వసతులు ఉండడంతో ఏ వస్తువునైనా మనిషి సాయం లేకుండానే తయారు చేస్తున్నారు. అయితే ఒకప్పటి కాలంలో ఎలాంటి సౌకర్యాలు లేకున్నా.. కేవలం చేతులతోనే అద్భుత కలాఖండాలు, ఆశ్చర్యం కలిగించే నిర్మాణాలను చేపట్టగలిగారు. ఇప్పటికీ అవి చెక్కుచెదరకుండా ఉన్నాయంటే.. అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటారా? సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్‌మిల్‌ తయారు చేసిన విధానం.. అందరినీ ఆకట్టుకుంటోంది. విద్యుత్‌, బ్యాటరీలతో పనిలేకుండా అతడు రూపొందించిన ట్రెడ్‌మిల్‌.. ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.


Arunn Bhagavathula.. @ArunBee అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. కొన్ని బేరింగులు, మరికొన్ని చెక్కలతో ఓ వ్యక్తి  ట్రెడ్‌మిల్‌ తయారు చేసే విధానం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముందుగా ఏర్పాటు చేసుకున్న చెక్క స్టాండ్లలో.. ఒక స్టాండ్‌కు కొన్ని బేరింగులను, మరో స్టాండ్‌కు వాటికి అమరే విధంగా ఇనుప రింగ్‌లను అమర్చుతాడు. మరోవైపు అప్పటికే గొలుసు తరహాలో తయారు చేసి పెట్టుకున్న చెక్క పలకలను వాటిపై బిగిస్తాడు. దానిపై మనిషి నిలబండేందుకు వీలుగా ఏర్పాట్లు చేసి.. చివరకు ఎలక్ట్రానిక్ ట్రెడ్‌మిల్‌‌కు ఏమాత్రం తీసిపోనివిధంగా అతడు ఉడన్ ట్రెడ్‌మిల్ సిద్ధం చేస్తాడు! మార్కెట్‌లో దొరికే ట్రెడ్‌మిల్‌‌ యంత్రాల వినియోగం.. ఖర్చుతో కూడుకోవడంతో పాటూ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ శిల్పి తయారు చేసిన ట్రెడ్‌మిల్‌.. మనిషి నడకను అనుసరించి చెక్క బెల్టు తిరుగుతూ ఉంటుంది కాబట్టి, ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశమే లేదు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ వావ్! ఈ ట్రెడ్‌మిల్‌ చాలా బాగుంది.. మాకూ తయారు చేసి పంపండి’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అరె! ఇతనేంటి.. నీటితో నిండిన వాటర్ బాటిళ్లను నోటితో ఊదేశాడు.. చూస్తే అవాక్కవుతారు..





Updated Date - 2022-03-18T22:22:12+05:30 IST