కరోనాకు బీమా కవరేజీ

ABN , First Publish Date - 2020-03-06T06:37:37+05:30 IST

కరోనా వైరస్‌ వంటి అంటువ్యాధి చికిత్సకు మార్కెట్లో విక్రయిస్తున్న దాదాపు అన్ని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలతో కవరేజీ లభిస్తుందని...

కరోనాకు బీమా కవరేజీ

  • ప్రస్తుత పాలసీలతోనే పొందొచ్చు
  • జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ వెల్లడి

ముంబై: కరోనా వైరస్‌ వంటి అంటువ్యాధి చికిత్సకు మార్కెట్లో విక్రయిస్తున్న దాదాపు అన్ని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలతో కవరేజీ లభిస్తుందని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. దేశంలోని 44 సాధారణ బీమా కంపెనీలకు ఈ కౌన్సిల్‌ ప్రాతినిథ్యం వహిస్తోంది. ప్రస్తుత హెల్త్‌ పాలసీల్లో కరోనా వైరస్‌ చికిత్సకూ బీమా కవరేజీ కల్పించాలని, ఈ కేసుల్లో క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని భారత బీమా అభివృద్ధి, నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏఐ) బుధవారం ఇన్సూరెన్స్‌ కంపెనీలను కోరింది. ఈ నేపథ్యంలోనే కౌన్సిల్‌ స్పష్టతనిచ్చింది. 

Updated Date - 2020-03-06T06:37:37+05:30 IST