కరోనా ఎట్‌ 385

ABN , First Publish Date - 2020-10-23T10:10:26+05:30 IST

కరోనా ఎట్‌ 385

కరోనా ఎట్‌ 385

తగ్గుతున్న పాజిటివ్‌ శాతం

తాజాగా మరో నలుగురు మృతి


గుంటూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ గతంతో పోల్చితే తగ్గుముఖం పట్టినా నిత్యం మూడు వందల నుంచి నాలుగు వందల మధ్య కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే పాజిటివ్‌ శాతం తగ్గడం ఊరటనిస్తోన్నది. ఒకదశలో ప్రతీ 100 మందికి టెస్టు చేస్తే 15 మందికి పాజిటివ్‌ రాగా నేడు అది 4.46 నుంచి 7.47 మధ్య కొనసాగుతోన్నది. గురువారం వివిధ ల్యాబ్‌ల నుంచి 8,630 శాంపిల్స్‌ ఫలితాలు రాగా వాటిల్లో 385(4.46 శాతం) మందికి మాత్రమే కరోనా సోకింది. జిల్లాలో ఇప్పటి వరకు 65,468 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 61,228(93.52 శాతం) మంది కోలుకున్నారు. చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోవడంతో మృతుల సంఖ్య 661(1.01 శాతం)కు చేరింది. గురువారం రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహించారు. తొలిసారిగా ఒకే రోజున 10,503 శాంపిల్స్‌ని సేకరించారు. ఇక నుంచి నిత్యం 10 వేలకు పైగా శాంపిల్స్‌ సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయడం వల్ల వైరస్‌ బారిన పడిన వారిని త్వరితగతిన గుర్తించి మరింతగా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. కొత్తగా గుంటూరు నగరంలో 102, మంగళగిరి - 26, నరసరావుపేట - 22, చిలకలూరిపేట - 18, బాపట్ల - 18, తెనాలి - 15, పొన్నూరు - 14, రేపల్లె - 14, చేబ్రోలు - 11, వేమూరు - 11, కర్లపాలెం - 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  మిగిలిన మండలాల్లో మరో 124 కేసులు వచ్చినట్లు  డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌ తెలిపారు. 


Updated Date - 2020-10-23T10:10:26+05:30 IST