వైరస్‌ పంజా

ABN , First Publish Date - 2020-08-09T10:01:47+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. పాజిటివ్‌ కేసులు పెరిగిపోవడంతో మరణాల సంఖ్య ఈ నెలలో..

వైరస్‌ పంజా

 జిల్లాలో కొత్తగా 601 కరోనా పాజిటివ్‌ కేసులు.. 

14 మంది మృత్యువాత

22,456కి చేరుకొన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య

 

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. పాజిటివ్‌ కేసులు పెరిగిపోవడంతో మరణాల సంఖ్య ఈ నెలలో ఉచ్ఛస్థాయికి చేరుకొంటోంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే 86 మరణాలు చోటు చేసుకోవడం జిల్లా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. శనివారం 5,095 టెస్టుల ఫలితాలు విడుదల చేయగా అందులో 601 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో జిల్లావ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,456కి చేరుకొన్నది. 4,881 మంది డిశ్చార్జ్‌ కాగా ఇంకా 17,302 మంది యాక్టివ్‌లో ఉన్నారు. గడచిన 24 గంటల్లో 14 మంది మృత్యువాత పడ్డారు. తెనాలి పట్టణంలో 52, రూరల్‌ మండలం కోపల్లె గుడివాడ 4, కఠవరం, అంగలకుదురు, పెదరావూరులో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయ వర్గాలు తెలిపాయి.


వినుకొండ పట్టణంలో 16 కరోనా కేసులు నమోదైనట్లు ఆర్‌ఐ జానీబాషా  తెలిపారు.  ఇందిరానగర్‌లో 13, కట్టకిందబజారు, కొత్తపేట ఒక్కొక్క కేసుతో పాటు ఓ వీఆర్వోకు  పాజిటివ్‌ నమోదైనట్లు ఆయన తెలిపారు.  ఓ సచివాలయ ఉద్యోగి, పెదకంచర్లలో మరొకరు కరోనా బారిన పడ్డారు.  నరసరావుపేటలో శనివారం 21 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారించారు. పట్టణంలోని 16 మందికి, మండలంలోని గ్రామాల్లో 5 గురికి కరోనా సోకింది. రేపల్లె మండలం పేటేరులో 35 కేసులు నమోదయ్యాయి. వేమూరు మండలం పెరవలిలో 19, చదలవాడలో 5, వరహాపురంలో 2, వేమూరులో 1 కేసు గుర్తించారు. కరోనా చికిత్స పొందుతూ చుండూరు మండలం చినపరిమికి చెందిన వృద్దుడు(68) శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తహసీల్దార్‌ విజయజ్యోతికుమారి తెలిపారు. కర్లపాలేనికి చెందిన ఓ యువకుడు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి శనివారం మృతి చెందాడు.  


డీఎంహెచ్‌వో ప్రకటించిన కేసుల జాబితా

గుంటూరు నగరం - 173

మాచర్ల - 75

తెనాలి - 43

మంగళగిరి - 32

నరసరావుపేట - 30

బాపట్ల - 23

ఈపూరు - 23

కొల్లూరు - 21

పెదనందిపాడు - 19

చిలకలూరిపేట - 17

వినుకొండ - 16

ముప్పాళ్ల - 14

దాచేపల్లి - 13

సత్తెనపల్లి - 12

మిగిలిన ప్రాంతాల్లో 91 కేసులు.. జిల్లాలో మొత్తం 601 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-08-09T10:01:47+05:30 IST